Ola Electric Mobility: మార్కెట్లో టాప్ గేర్‎లో దూసుకుపోతున్న ఓలా షేర్...6 సెషన్లలో 92% పెరుగుదల

Ola Electric Mobility share: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ షేరు ధర వరుసగా 6వ సెషన్లో కూడా భారీగా పెరిగింది. షేరు ధర ఏకంగా 96 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేర్లు ఐపీవో లిస్టింగ్ తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపు అయ్యింది.

Written by - Bhoomi | Last Updated : Aug 19, 2024, 04:09 PM IST
Ola Electric Mobility: మార్కెట్లో టాప్ గేర్‎లో దూసుకుపోతున్న ఓలా షేర్...6 సెషన్లలో 92% పెరుగుదల

Ola Electric Mobility share price: ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం మార్కెట్లో దుమ్ము దులిపాయి. నేటి ట్రేడింగ్ లో ఈ  ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. తాజాగా నేడు మార్కెట్ ముగిసిన నాటికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ద్వారా 10% లాభపడి 146 రూపాయల వద్ద ముగిసింది. అయితే ఈ స్టాక్ ఐపీఓ ఇష్యూ ధర 76 రూపాయలు కావడం విశేషం. ఈ లెక్కన చూసినట్లయితే ఈ స్టాక్ ధర సుమారు 92 శాతం పెరిగింది. ఒకరకంగా ఇన్వెస్టర్ లోకి ఇది పంట పండించే చెప్పాలి. నేడు ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే అప్పర్ సర్కిల్ వద్ద లాక్ అయింది.

దీంతో షేర్లు 10 శాతం లాభపడి 146 రూాపాయల వద్ద చేరుకున్నాయి. వరుసగా పెరుగుతున్న షేర్ల ధరలను  బట్టి చూసినట్లయితే  ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.64,411.35 కోట్లకు పెరిగింది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఐపీవో సందర్భంగా ఒక్కో షేరుకు రూ.76 చొప్పున స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ సమయంలో ఈ షేర్లు  ఇన్వెస్టర్లకు పెద్దగా లాభాలను అందించలేదు. ఫ్లాట్ గానే లిస్ట్ అయ్యాయి.కానీ ఈ స్టాక్ అత్యంత వేగంగా  20 శాతం పెరిగింది, కాసేపటికి ఈ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. కానీ వరుసగా 6 సెషన్లలో  ఈ షేర్ల ధరలు చూసినట్లయితే 96% వరకు పెరిగాయి. 

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ మొట్టమొదటి పబ్లిక్ ఆఫర్‌ కింది రూ.6,145-కోట్లను సేకరించడమే లక్ష్యంగా అడుగు పెట్టింది. IPO బిడ్డింగ్ చివరి రోజున 4.27 రెట్లు సబ్‌స్క్రిప్షన్ రేటుతో మంచి ఆదరణ పొందింది. IPO ప్రతి షేరుకు రూ.72-76 ధరను కలిగి ఉంది మరియు రూ. 5,500 కోట్ల వరకు తాజా ఇష్యూతో పాటు 8.49 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ను కలిగి ఉంది.

Also Read : IPO: ఐపీవో మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉందా..ఈ వారం తెరుచుకునే 2 ఐపీవోలపై ఓ లుక్ వేయండి  

 ఇక కంపెనీ  ఫైనాన్షియల్ విషయాలకు వస్తే  గత జూన్ త్రైమాసికంలో, ఓలా ఎలక్ట్రిక్ వార్షిక ఆదాయంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.267 కోట్ల నష్టంతో పోలిస్తే కంపెనీ నష్టం రూ.347 కోట్లకు పెరిగింది.

గత వారం ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో  రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో మోడల్‌లను విడుదల చేసింది. దీని ద్వారా కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. మరో రెండేళ్లలో కంపెనీ తన సొంత బ్యాటరీ సెల్‌లను ఓలా వాహనాల్లోకి చేర్చడాన్ని ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం షేర్లు లిస్టింగ్ తర్వాత భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన కలగడం సహజమే.   అయితే ఇన్వెస్టర్లు ఐపీఓ ద్వారా పొందిన లాభాలను కొద్ది మేర ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ద్వారా పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!  

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News