Google Pay Tips: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే ఇలా చాలా రకాల యూపీఐ యాప్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనం ఎవరికి ఎప్పుడెప్పుడు ఏ లావాదేవీలు చేశామో హిస్టరీ ఉంటుంది. మీరు వద్దనుకుంటే ఈ హిస్టరీని డిలీట్ కూడా చేయవచ్చు. అదెలాగో తెలుసుకోవాలనుకుంటే ఆ వివరాలు మీ కోసం.
ప్రస్తుతం మనం ఇక్కడ చర్చించేది గూగుల్ పే యాప్ గురించి. గూగుల్ పేలో ప్రతి ఒక్క లావాదేవీ వివరాలు రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడు ఎవరికి ఎంత మొత్తం చెల్లించామో అన్నీ వివరంగా ఉంటాయి. ఈ ట్రాన్‌శాక్షన్ హిస్టరీని వద్దనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. యూజర్లకు ఆ వెసులుబాటు ఉంది. చాలామందికి ఈ విషయం తెలియదు. గూగుల్ పేలో Transaction History డిలీట్ చేసేందుకు ఓ ప్రక్రియ ఉంది. ఎలా డిలీట్ చేయవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం
ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్ క్లిక్ చేయాలి. దిగువకు స్క్రోల్ చేసి సెట్టింగ్స్‌లో వెళ్లాలి. సెట్టింగ్స్ నుంచి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ట్యాప్ చేయాలి. ఇప్పుడు డేటా అండ్ పర్సనలైజేషన్ ఎంచుకోవాలి. తరువాత గూగుల్ ఎక్కౌంట్ లింక్ క్లిక్ చేస్తే మీ ముందు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ కిందకు స్క్రోల్ చేస్తే ప్రతి లావాదేవీ వివరాలు వేర్వేరుగా కన్పిస్తాయి. ఇప్పుడు ఏది కావాలంటే ఆ లావాదేవీని ఎంచుకుని డిలీట్ చేయవచ్చు.
గూగుల్ పే Transaction History డిలీట్ చేసిన తరువాత పేమెంట్స్ ట్రాన్‌శాక్షన్స్ అండ యాక్టివిటీ కూడా డిలీట్ చేయవచ్చు. ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కన్పిస్తాయి. లాస్ట్ హవర్, లాస్ట్ డే అని కన్పిస్తుంది. ఆల్ టైమ్ కస్టమ్ రేంజ్ కూడా ఉంటుంది. కస్టమ్ రేంజ్ ఎంచుకుంటే ఎప్పుడు ఏది కావాలంటే అదే డిలీట్ చేయవచ్చు.
గూగుల్ పే లావాదేవీల వివరాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫర్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి. తద్వారా మీ చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది. మీ ఎక్కౌంట్ నుంచి ఎంత మొత్తం నగదు ఎప్పుడు ఎలా వినియోగించారో తెలుసుకునేందుకు వీలవుతుంది.
Also read: NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook