Pan Card Misuse: మీ పాన్‌కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

Pan Card Misuse: దేశంలో ఆర్ధిక లావాదేవీలకు కావల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ పాన్‌కార్డు. తెలిసో, తెలియకో చాలా చోట్ల పాన్‌కార్డు జిరాక్స్ కాపీ లేదా నెంబర్ ఇస్తుంటాం. ఇది దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే పాన్‌కార్డు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2024, 01:49 PM IST
Pan Card Misuse: మీ పాన్‌కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

Pan Card Misuse: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి. మీకు తెలియకుండా మీ పాన్‌కార్డు వివిధ రకాల ఆర్ధిక లావాదేవీల్లో ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదంతోపాటు అసాంఘిక విషయాలకు వినియోగమైతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే పాన్‌కార్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

వివిధ రకాల ఆర్ధిక లావాదేవీలకు పాన్‌‌కార్డు తప్పనిసరిగా అవసరమౌతుంది. అందుకే చాలా చోట్ల పాన్‌కార్డు జిరాక్స్ లేదా నెంబర్ ఇచ్చేస్తుంటాం. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో చాలా సంస్థలకు అడిగిన వెంటనే పాన్‌కార్డు వివరాలు సమర్పిస్తుంటాం. కానీ ఇలా చేయడం వల్ల పాన్‌కార్డు దుర్వినియోగమయ్యే పరిస్థితి ఉంది. ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే 10 అంకెల ఆల్ఫా న్యూమరికల్ కార్డు ఇది. ఆర్ధిక లావాదేవీలకే కాకుండా గుర్తింపు కార్డుగా కూడా వినియోగిస్తుంటారు. తెలిసో తెలియకో మీ పాన్‌కార్డు దుర్వినియోగమైందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. 

బ్యాంక్ స్టేట్‌మెంట్స్, క్రెడిట్ కార్డు బిల్లులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఇలా చెక్ చేసేటప్పుడు ఏదైనా అనధికారిక లావాదేవీలున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. క్రెడిట్ బ్యూరోలు జారీ చేసే క్రెడిట్ రిపోర్ట్ నుంచి కూడా పాన్‌కార్డు మీకు తెలియకుండా ఎక్కడైనా వినియోగమైందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ అనధికారిక క్రెడిట్ ఎక్కౌంట్లు కన్పిస్తే వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. పాన్‌కార్డుతో మీ ఖాతలో లాగిన్ అయి ట్యాక్స్ ఫైలింగ్ చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా ఉంటే తెలిసిపోతుంది. ఫామ్ 26ఏఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

మీకు తెలియకుండా మీ పాన్‌కార్డు ద్వారా లావాదేవీలు లేదా లోన్ ఎక్కౌంట్లు కన్పిస్తే తక్షణం సంబంధిత బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థను సంప్రదించి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మీ ఫిర్యాదు ఆధారంగా బ్యాంకు అధికారులు వివరాలు పరిశీలించి అనధికారిక యాక్సెస్ ఉంటే బ్లాక్ చేస్తారు. అదే సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇన్‌కంటాక్స్ శాఖకు సంబంధించిన కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి ఫిర్యాదు ఇవ్వాలి. 

Also read: Gold Rate Hike: పసిడిప్రియులకు షాకింగ్‌ న్యూస్.. ఆల్‌ టైం హైలో తులం బంగారం.. ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News