How to Apply for PM Surya Ghar Muft Bijli Yojana Scheme: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సాహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం పచ్చజెండా ఊపింది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ.75,021 కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు. సబ్సిడీ, దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎవరు అర్హులు?
1. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి.
2. సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.
3. ఇంటికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
4. సౌర ఫలకాల కోసం గృహస్థులు ఏ ఇతర సబ్సిడీని పొంది ఉండకూడదు
మిగిలిన కరెంట్ అమ్ముకోవచ్చు..
రూప్ టాఫ్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకునేవారు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తొలి 300 యూనిట్లు ఫ్రీగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చు. దీని వల్ల లబ్ధిదారుడుకు నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. 1 కిలోవాట్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి రూ.30వేలు, 2 కిలోవాట్లకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.78వేలు గరిష్ఠ రాయితీ లభిస్తుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి..
Step 1: ముందుగా పీఎం సూర్యఘర్ (pmsuryaghar.gov.in) పోర్టల్‌కు వళ్లి అక్కడ పేరును నమోదు చేసుకోవాలి. ఇందుకోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి
Step 2: కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం అప్లై చేసుకోవాలి.
Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
Step 4: ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Step 5: నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక, డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
Step 6: ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు డిటేల్స్ పాటు పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. నెల రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
Also Read: FASTag KYC: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కేవైసీ గడువు మరోసారి పొడగింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook