FASTag KYC| వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రప్రభుత్వం. ఫాస్టాగ్ కేవైసీ గడువు మరోసారి పెంచింది. భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ పక్కా అని చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వేస్ట్ అయ్యేది.
భారత ప్రభుత్వం జనవరి1, 2021 నుంచి ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. డిసెంబర్ 1, 2017కు ముందు కన్నా వాహనాలకు ఫాస్టాగ్ పక్కా అని చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండం వల్ల చాలా ఇంధనం, ప్రయాణికుల సమయం వేస్ట్ అయ్యేది. దీన్ని అదిగమనించడాని బ్రేక్ లేని ప్రయాణం కోసం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది.
ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న ట్యాగ్. దీన్ని వాహానంలోని విండ్ షీల్డ్ పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే ప్లాజాలో ఉన్న RFID రీడర్ దాన్ని స్కాన్ చేసి చదివేస్తుంది. ఈ ట్యాగ్ పై ఉన్న ఎకౌంట్ నుంచి టోల్ ట్యాక్స్ కట్ అవుతుంది.
ఇదీ చదవండి: సూర్యఘర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నెలకు 300 యూనిట్ల కరెంటు ఉచితం..
మీకు వెహికల్‌కు ఫాస్టాగ్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే కేవైసీ గడువులోపు చేయించాలి. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్‌కు సంబంధించిన కేవైసీని పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29ని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. డెడ్‌లైన్‌లోపు కేవైసీ పూర్తి చేసుకోకపోతే.. ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిపోతుంది. బ్లాక్‌లిస్టులో ఉంటే రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆ బాధ లేదు కేవైసీ గడువును మరోసారి పెంచింది కేంద్రప్రభుత్వం. మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఫాస్టాగ్ ను మీరు ఆథరైజ్డ్ బ్యాంక్స్ అయినా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంక్, సిండికేట్ బ్యాంకు, ఎస్బీఐ, HDFC బ్యాంకు నుంచి కొనుగోలు చేయవచ్చు. దాంతో పాటు పెట్రోల్ బంక్స్, టోల్ ప్లాజా , పేటీఎం నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారి కొంటే 5 సంవత్సరాలు వాలిడిటీ ఉంటుంది.
ఇదీ చదవండి: టాప్ 5 పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ జామ్‌నగర్
ఫాస్టాగ్ కొనుగోలు చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు లేదా పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. మీ మొబైల్ నంబర్ నుంచి https://www.npci.org.in/ అధికారిక వెబ్‌సైట్లో మీ మొబైల్ నంబర్, ఓటీపీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook