PM Vidyalaxmi Scheme: నవంబర్ 6న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'పీఎం విద్యాలక్ష్మి' అనే కొత్త పథకానికి ఆమోదం లభించింది. ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడం ఈ పథకం లక్ష్యం.
ఈ పథకం కింద, నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో విద్యార్థులు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే వెసులుబాటు లభిస్తుంది. దీంతోపాటు విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వీలుగా విద్యా రుణంపై ప్రభుత్వం రాయితీని కూడా అందజేస్తుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ రుణాన్ని అందిస్తుంది. రూ. 7.5 లక్షల వరకు రుణాలకు 75శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని అందిస్తుంది.
ఈ పథకం ద్వారా, వార్షిక ఆదాయం రూ. 8 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు, ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్ లేదా వడ్డీ రాయితీ పథకం ప్రయోజనం పొందని కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కుటుంబాలకు మారటోరియం వ్యవధిలో రూ. 10 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ అందుతుంది. 2024-25 నుంచి 2030-31 వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.3600 కోట్లు ఖర్చు చేయనుందని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
విద్యా రుణం ఎలా పొందాలి?
ఉన్నత విద్యా శాఖ 'PM-విద్యాలక్ష్మి' అనే ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌ను కలిగి ఉంటుంది. దానిపై విద్యార్థులు అన్ని బ్యాంకుల ద్వారా దరఖాస్తు ప్రక్రియ ద్వారా వడ్డీ రాయితీతో పాటు విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోగలరు. వడ్డీ మాఫీ ఇ వోచర్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వాలెట్ ద్వారా చెల్లిస్తారు.
ఈ స్కీంలోని ముఖ్యాంశాలు ఇవే..
- ఇందులో ఉన్నత విద్య కోసం 7.5 లక్షల రూపాయల వరకు రుణాలపై భారత ప్రభుత్వం 75శాతం క్రెడిట్ గ్యారెంటీని ఇస్తుంది.
- రూ.8 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు రూ.10 లక్షల వరకు రుణాలపై 3శాతం వడ్డీ రాయితీ కూడా ఇవ్వబడుతుంది.
- రూ.4.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న విద్యార్థులు ఇప్పటికే పూర్తి వడ్డీ రాయితీ పొందుతున్నారు.
- దేశంలోని 860 ప్రధాన ఉన్నత విద్యా కేంద్రాల నుండి 22 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు.
- PM విద్యాలక్ష్మి యోజన అనేది జాతీయ విద్యా విధానం, 2020 పొడిగింపు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.