Portable LED Fans: వేసవిలో ఓ పరిస్థితి..వర్షాకాలంలో మరో స్థితి. బయట వర్షాలున్నా లోపల మాత్రం ఉక్కపోతే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏసీలా ఉండే మినీ పోర్టబుల్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ వీలైతే అక్కడ అమర్చుకునే సౌలభ్యముంటుంది ఇందులో.
దేశమంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలంలో ఇంట్లో కాస్త ఉక్కపోత ఉంటుంది. ఏసీలో సేద తీరే పరిస్థితి ఉన్నా..ప్రతిచోటా సాధ్యం కాదు. వేడి ఎక్కువగా ఉండే కిచెన్‌లో ఏసీ సాధ్యం కాదు. అందుకే ఈ పోర్టబుల్ మినీ ఫ్యాన్. ఇది పెట్టుకుంటే ఏసీ ఉన్నట్టే ఉంటుంది.
ఇదొక పోర్టబుల్ రీఛార్జబుల్ ఎల్ఈడీ ఫ్యాన్. 2200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో వస్తోంది. ఒకసారి పూర్తిగా రీఛార్జ్ చేస్తే 13 గంటలు నడుస్తుంది. ఇందులో 3 వరకూ స్పీడ్ మోడ్స్ ఉంటాయి. హైలో అయితే 7 గంటల వరకూ పనిచేస్తుంది. పోర్టబుల్ రీఛార్జబుల్ ఎల్ఈడీ ఫ్యాన్ ధర కూడా తక్కువే. కేవలం 2 వందలకే లభిస్తుంది. అమెజాన్‌లో ఈ ఫ్యాన్ 60 శాతం డిస్కౌంట్ తరువాత 199 రూపాయలు లభిస్తోంది.
ఇక మరో పోర్టబుల్ ఫ్యాన్ కూడా ఉంది. Forty4 10000mAh 8-Inch Portable Clip-on Fan ఇది 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 4 స్పీడ్ మోడ్స్, 360 డిగ్రీల రొటేషన్ ఉంది. ఈ ఫ్యాన్‌ను మీరు ఆఫీసు టేబుల్, కారులో, కిచెన్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అమెజాన్‌లో ఈ ఫోన్ 3 వేల 224 రూపాయలకు లభిస్తోంది.
మరో పోర్టబుల్ ఫ్యాన్ Geek Rechargeable Mini Fan with Battery.రాత్రి వేళ నైట్ బల్బ్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో 4 వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 90 డిగ్రీల వరకూ తిరుగుతుంది. ఇందులో 5 బ్లేడ్స్ ఉండటం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ మోడ్స్ నాలుగు ఉంటాయి. అమెజాన్‌లో ఈ ఫ్యాన్ 2 వేల 975 రూపాయలకు లభిస్తోంది.
మరో పోర్టబుల్ మినీ ఫ్యాన్ ఇది. Bulfyss USB Rechargeable Table Air Fan.ఇది కూడా ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చుకోవచ్చు. కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాన్ అమెజాన్‌లో 1299 రూపాయలకు లభిస్తోంది.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.