PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు సంబంధించి షాకిచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ స్కీం ద్వారా ఏడాదికి రూ. 6వేలు అందిస్తూన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే పీఎం కిసాన్ 19వ విడత నిధులను రిలీజ్ చేయనుంది కేంద్రం. ఈ తరుణంలోనే రైతులకు బిగ్ షాకిచ్చింది.
2019లో కేంద్రంలోని మోదీ సర్కార్ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రికిసాన్ సమ్మాన్ నిధి స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీం కింద రైతులకు పంట సహాయం కోసం ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ. 2వేలు చొప్పున మొత్తంగా రూ. 6వేలు అందిస్తోంది. అయితే త్వరలోనే కేంద్రం 19వ విడత నిధులను కేంద్రం రైతుల అకౌంట్లో జమ చేయాల్సిఉంది. అయితే ఈ సారి లక్షల మంది రైతులకు ఈ స్కీం అందే అవకాశం లేదు. ఎందుకో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పీఎం కిసాన్ పథకాన్ని ప్రతి ఏడాది అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రధాని మోదీ విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కటాఫ్ డేట్ ను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. కటాఫ్ డేట్ అంటే 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1వ తేదీ మధ్య భూమి ఎవరిపేరుపై ఉంటే వారికే పీఎం కిసాన్ స్కీంకు అర్హులు అవుతారని కేంద్ర మార్గదర్శకాల్లో పేర్కొంది. 2019 1వ తేదీ తర్వాత భూమి అమ్మడం, కొనడం లేదా మార్పులు చేర్పులు అయిన రైతులకు ఈ స్కీం అందడం లేదు.
Also Read: School Half Days: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. నవంబర్ 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే స్కూళ్లు..
కేంద్రం తీసుకువచ్చిన ఈ మార్గదర్శకాల వల్ల చాలా మందిసన్న, చిన్నకారు రైతులకు ఈ పీఎం కిసాన్ నిధులు అందడం లేదు. అయితే రైతుల పేరుతో భూమిపై ఉన్నా సరే వారికి ఈ సహాయం అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ రైతులు అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కటాఫ్ తేదీ తర్వాత వారి పేరుపైకి ట్రాన్స్ ఫర్ చేయించుకుని కేంద్రం అందించే పీఎం కిసాన్ స్కీంకు దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. వారసత్వం ద్వారా భూమి పొందిన వారి దరఖాస్తులను కూడా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రూల్స్ వల్ల లక్షలాది మంది రైతులు అనర్హులుగా మారుతున్నారు. దీంతో కేంద్రం ఈ రూల్స్ సవరించాలని రైతులు కోరుతున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.