RBI action On Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది. ఐటీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడాన్ని నిలిపివేయడంతో పాటు క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ సిస్టమ్స్‌ను రెండేళ్లుగా పరిశీలిస్తున్న ఆర్‌బీఐ.. టెక్నికల్ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్వైజరీ సమస్యలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంక్ తన ఐటీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి చర్యలు చేపట్టిందని, బ్యాలెన్స్ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఆర్‌బీఐతో కలిసి పని చేస్తూనే ఉంటుందని తెలిపింది. తాజాగా విధించిన ఆంక్షలు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపవని క్లారిటీ ఇచ్చింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి సేవలు పొందుతున్న కస్టమర్లు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు యాథావిధిగా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారానే ఎక్కువగా ఖాతాలు ఓపెనింగ్ ఎక్కువ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డు బిజినెస్‌పై కూడా ప్రభావం గట్టిగానే ఉంటుందని చెబుతున్నారు.
"ఐటీ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ప్యాచ్, చేంజ్ మేనేజ్‌మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్‌మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా రంగాలలో తీవ్రమైన లోపాలు, నిబంధనలు పాటించలేదు. లీక్ ప్రీవెన్షన్ స్ట్రాటజీ, వ్యాపార కొనసాగింపు, విపత్తు పునరుద్ధరణ కఠినత, డ్రిల్, డిజాస్టర్ రికవరీ తదిర వంటి వాటిలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. వరుసగా రెండేళ్లుగా రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం అవసరాలకు విరుద్ధంగా, దాని ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపాలు ఉన్నట్లు అంచనా వేశాం.." అని ఆర్‌బీఐ వెల్లడించింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడం, తాజా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడం తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ కింద ఉన్న అవసరాలకు విరుద్ధంగా, వరుసగా రెండు సంవత్సరాలు, బ్యాంక్ ఐటీ రిస్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపం ఉన్నట్లు అంచనా వేసినట్లు వెల్లడించింది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ వ్యవస్థపై నిఘా పెట్టి లోపాలపై వివరణ అడిగినప్పుడు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో పాటు లోపాలను సరిద్దిద్దక పోవడంతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కోటక్ సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. 2020 డిసెంబర్ నెలలో HDFC బ్యాంక్‌పై కూడా ఆర్‌బీఐ ఇదే తరహా చర్యలు తీసుకుంది. కొత్త కార్డ్‌లను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యక్రమాలను ప్రారంభించకుండా నిరోధించింది. ఆ తర్వాత మార్చి 2022లో ఈ ఆంక్షలు ఎత్తివేసింది.
Also Read: Sun Transit 2024: మీనరాశిలోకి సూర్యుడు.. మే 13 వరకు ఈ రాశువారికి ముట్టిందల్లా బంగారమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి