RBI Alert: బ్యాంకులపై ఆర్బీఐ కొత్త ఆంక్షలు, 5 వేల కంటే ఎక్కువ డ్రా చేయలేరిక, మీ బ్యాంకు ఉందో లేదో

RBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ జారీ చేస్తుంటుంది. బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీ బ్యాంక్ ఎక్కౌంట్‌పై ప్రభావం చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2023, 12:40 PM IST
RBI Alert: బ్యాంకులపై ఆర్బీఐ  కొత్త ఆంక్షలు, 5 వేల కంటే ఎక్కువ డ్రా చేయలేరిక, మీ బ్యాంకు ఉందో లేదో

ఆర్బీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మీ ఖాతాల్లోంచి కేవలం 5 వేల రూపాయల నగదే డ్రా చేయగలరు. ఆశ్చర్యపోతున్నారా..అయినా ఇది నిజం. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..

దేశంలోని అత్యున్నత బ్యాంకింగ్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం మీ ఎక్కౌంట్లో డబ్బులు ఉన్నా..5వేలకు మించి డ్రా చేయలేరు. ఇందుకు సంబంధించి ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ఆర్బీఐ ఎప్పటికప్పుడు వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే నగదు విత్‌డ్రాపై ఎందుకు ఆంక్షలు విధించిందనేది తెలుసుకుందాం..

కేవలం 5 వేల విత్‌డ్రాకే అనుమతి

ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కొన్నిబ్యాంకులకు సంబంధించి మాత్రమే. ఈ బ్యాంకుల ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ మొత్తం 5 బ్యాంకులపై ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో 2 బ్యాంకుల కస్టమర్లు తమ ఖాతాల నుంచి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే తీసుకోగలరు. ఈ ఆంక్షలు 6 నెలల పాటు అమల్లో ఉంటాయి.

ఏ బ్యాంకులపై ఆంక్షలు

లిక్విడిటీ తక్కువగా ఉండటంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉరవకొండలోని ఉరవకొండ సహకార బ్యాంకు, మహారాష్ట్రలోని శంకర్‌రావు మోహితే పాటిల్ సహకార బ్యాంకులపై ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రకారం ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు ఇకపై కేవలం 5000 మాత్రమే నగదు విత్‌డ్రా చేయగలరు. 

రుణాలిచ్చే అధికారం లేదు

నగదు విత్‌డ్రా పై ఆంక్షలే కాకుండా రుణాలు లేదా అడ్వాన్స్ రెన్యువల్ కూడా ఈ రెండు బ్యాంకులు చేయలేవు. ఏ విధమైన పెట్టుబడి కూడా పెట్టడానికి వీల్లేదు. దాంతోపాటు రెండు బ్యాంకులు ఏ ఒప్పందం లేదా ఏదైనా ఆస్థి అమ్మకం లేదా బదిలీ చేయజాలవు. 

ఆర్బీఐ నోటిఫికేషన్‌లో ఏముంది

ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో బ్యాంకులు తమ తమ ఆర్ధిక పరిస్థితిని మెరుగు పర్చుకునేవరకూ ఆంక్షలతో  కూడిన బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగించవచ్చు. ఉత్తరప్రదేశ్ లక్నోలోని హెచ్‌సీబీఎల్ సహకార బ్యాంకు, మహారాష్ట్ర ఔరంగాబాద్‌లోని ఆదర్శ మహిళా సహకార బ్యాంకు, కర్ణాటక మాండ్యాలోని శిమ్షా సహకార బ్యాంకుల ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఈ బ్యాంకుల కస్టమర్లు తమ ఖాతాల్లోంచి డబ్బులు తీసుకోలేరు. ఈ ఐదు సహకార బ్యాంకుల అర్హత కలిగిన డిపాజిటర్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి 5 లక్షల వరకూ డిపాజిట్ బీమా క్లెయిమ్ పొందేందుకు అర్హులు.

Also read: Royal Enfield Hunter 350: ఈ బైక్‌ని ఎగబడి మరీ కొంటున్న జనం.. 6 నెలల్లో లక్షకుపైగా బైక్స్ అమ్మకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News