UP Tragic Incident: పాము కాటుతో అన్నాదమ్ముల మృతి.. అన్న అంత్యక్రియలకు హాజరై అదే పాము కాటుకు బలైన తమ్ముడు

UP Tragic Incident: యూపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అన్నాదమ్ములు ఇద్దరు పాముకాటుతో మృతి చెందిన ఘటన బలరాంపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 12:09 PM IST
  • యూపీలో విషాద ఘటన
  • బలరాంపూర్ జిల్లాలో పాముకాటుతో అన్నాదమ్ముల మృతి
  • అన్న అంత్యక్రియలకు హాజరైన తమ్ముడికి పాము కాటు
UP Tragic Incident: పాము కాటుతో అన్నాదమ్ముల మృతి.. అన్న అంత్యక్రియలకు హాజరై అదే పాము కాటుకు బలైన తమ్ముడు

UP Tragic Incident: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో చనిపోయిన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన ఓ యువకుడు అదే పాము కాటుకు బలయ్యాడు. యూపీలోని బలరాంపూర్ జిల్లాలో బుధవారం (ఆగస్టు 3) ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానిక పోలీస్ రాధా రమణ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం... బలరాంపూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అరవింద్ మిశ్రా (38) అనే వ్యక్తి పాము కాటుతో మంగళవారం (ఆగస్టు 2) మృతి చెందాడు. బుధవారం అరవింద్ మిశ్రా అంత్యక్రియలు నిర్వహించగా.. పంజాబ్‌లోని లూథియానా నుంచి అతని తమ్ముడు గోవింద్ మిశ్రా (22) వచ్చాడు.

అంత్యక్రియలు ముగిసిన అనంతరం గోవింద్ మిశ్రా, అతని బంధువు చంద్రశేఖర్ పాండే (22) ఒక గదిలో నిద్రించారు. ఆ రాత్రి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పాము ఆ ఇద్దరినీ కాటేసింది. గోవింద్ మిశ్రా కాసేపటికే మృతి చెందాడు. చంద్రశేఖర్ పాండేని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. అన్న అంత్యక్రియలకు వెళ్లి తమ్ముడు కూడా పాము కాటుకు బలవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

బాధిత కుటుంబాన్ని జిల్లా మెడికల్ ఆఫీసర్లు పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కైలాష్ నాథ్ బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన సాయం వారికి అందేలా స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చారు.  మరోసారి పాము కాటు ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read: Bimbisara Twitter Review: కల్యాణ్ రామ్ 'బింబిసార' ట్విట్టర్ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..

Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News