Rbi Hikes Repo Rate: హోమ్‌ లోన్లు తీసుకున్న వారికి షాక్.. వడ్డీ రేట్లు పెంచి ఆర్బీఐ.. ఈఎంఐ ఎంత పెరిగిందంటే..?

Home Loan Interest Rate Hike: ఆర్బీఐ మరోసారి రెపో రేట్లను పెంచింది. గతంలో మాదిరి ఈసారి కూడా 50 బేస్ పాయింట్లు పెంచుతుందని అందరూ అంచనా వేయగా.. 35 బేసిస్ పాయింట్లు పెంచడం ఉపశమనం కలిగించింది. అయినా ఈఎంఐలు చెల్లించే వారికి మరింత భారం పడనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 01:21 PM IST
  • రెపో రేట్లను మరోసారి పెంచిన ఆర్బీఐ
  • 35 బేసిస్ పాయింట్లు పెంపు
  • ఈఐంఎ చెల్లింపుదారులపై మరింత భారం
Rbi Hikes Repo Rate: హోమ్‌ లోన్లు తీసుకున్న వారికి షాక్.. వడ్డీ రేట్లు పెంచి ఆర్బీఐ.. ఈఎంఐ ఎంత పెరిగిందంటే..?

Home Loan Interest Rate Hike: సామాన్యులకు ఆర్బీఐ షాకిచ్చింది. ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై భారం పడనుంది. రెపో రేటును పెంచుతూ ఆర్‌బీఐ మరోసారి నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం చివరి రోజు బుధవారం ఆర్‌బీఐ రెపో రేటును 0.35 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఆర్‌బీఐ ఇప్పటికే నాలుగు ద్రవ్య విధాన సమావేశాలలో రెపో రేటును 1.90 శాతం పెంచింది. గత 8 నెలల్లో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతం నుంచి 6.25 శాతానికి పెంచింది. ఈ మేరకు సమావేశ నిర్ణయాలను  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గత పెంపులో 50 బేసిస్ పాయింట్లు పెంచగా.. ఈసారి రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచడం కాస్త ఉపశమనంగా చెప్పవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రెపో రేటును పెంచకతప్పట్లేదు.

ఆర్బీఐ నిర్ణయం తర్వాత.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహ రుణాల వడ్డీ రేట్లను పెంచనున్నాయి. కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తే ఈఎంఐ చెల్లింపు మరింత పెరగనుంది. రెపో రేటుతో అనుసంధానించిన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు పెరగడంతో.. ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లలో 0.35 శాతం పెరుగుదల ఉంటుంది.  

ఈఎంఐ ఎంత పెరిగింది..?

ప్రస్తుత వడ్డీ రేటు 8.40 శాతం ప్రకారం దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ నుంచి 20 సంవత్సరాల పాటు రూ.25 లక్షల గృహ రుణం కోసం మీరు రూ.21,538 ఈఎంఐ చెల్లిస్తున్నారని అనుకుందాం. రెపో రేటులో 35 బేసిస్ పాయింట్లు పెరిగిన తర్వాత.. వడ్డీ రేటు 8.75 శాతానికి పెరుగుతుంది. దానిపై ఈఎంఐ రూ.22,093 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీ ఈఎఐం ధర రూ.555 పెరిగింది. మీరు మొత్తం సంవత్సరంలో రూ.6,660 ఈఐఎం చెల్లించాలి.  

మీరు 20 సంవత్సరాల పాటు రూ.40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నట్లయితే.. దానిపై మీరు ప్రస్తుతం 8.40 శాతం వడ్డీని చెల్లిస్తున్నారని అనుకుందాం.. ప్రస్తుతం మీరు రూ.34,460 చెల్లించాలి. కానీ రెపో రేటును పెంచిన తర్వాత.. ఇప్పుడు మీరు 8.75 శాతం వడ్డీని చెల్లించాలి. దానిపై రూ.35,348 ఈఎఐం చెల్లించాలి. అంటే ప్రతి నెలా రూ.888 ఎక్కువ చెల్లించాలి. ఒక సంవత్సరంలో రూ.10,656 భారం పడనుంది.

మీరు 15 ఏళ్లపాటు రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నట్లయితే.. ప్రస్తుతం 8.40 శాతం వడ్డీ రేటుతో రూ.48,944 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రెపో రేటును పెంచిన తర్వాత.. వడ్డీ రేటు 8.70 శాతానికి పెరుగుతుంది. దానిపై రూ.49,972 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల రూ.1028 అదనంగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

రెపో రేటు అంటే.. 

బ్యాంకులకు ఆర్బీఐ నిధులు ఇస్తుంది. ఈ నిధులపై ఆర్బీఐ తీసుకునే వడ్డీని రెపో రేటు అంటారు. ద్రవ్యోల్బణం బట్టి ఈ రెపో రేటును ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచితే.. బ్యాంకులకు భారంగా మారుతుంది. దీంతో బ్యాంకులు నేరుగా ప్రజల మీదకు మళ్లించి అధిక వడ్డీలను వసూలు చేస్తాయి. అయితే వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ఇక్కడితో ఆగిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి తీసుకురావాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే జరిగితే.. రాబోయే నెలల్లో ఈఎంఐల చెల్లింపులో తగ్గింపు ఉండవచ్చు.

Also Read: Ind Vs Ban: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఊహించని నిర్ణయం.. టీమిండియా నుంచి ఆ ఇద్దరు ఔట్  

Also Read: Cyclone Mandous: ఏపీ వైపు దూసుకువస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News