Jio Data Plans: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి షాకిచ్చింది. డేటా వోచర్ల వ్యాలిడిటీలో కీలక మార్పులు చేసింది. డేటా వోచర్ల కాల పరిమితిని తగ్గించేసింది. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న జియో యూజర్‌కు ఇది ఊహించని దెబ్బ.
దేశంలోని అతిపెద్ద టెలీకం ఆపరేటర్ రిలయన్స్ జియో డేటా వోచర్ల కాల పరిమితి అంటే వ్యాలిడిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అత్యధికంగా రీఛార్జ్ అయ్యే 19,29 రూపాయల డేటా వోచర్ వ్యాలిడిటీని తగ్గించింది. రెగ్యులర్ ప్లాన్‌లో డేటా అయిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రీఛార్జ్ చేయించుకుని వినియోగించే డేటా ప్లాన్స్ ఇవి. ఈ ఏడాది జూలై 3 నుంచి ప్లాన్స్ టారిఫ్ పెంచినప్పుడు 15 రూపాయలు డేటా వోచర్ ప్లాన్ 19 రూపాయలైంది. ఇక 25 రూపాయల డేటా వోచర్ ప్లాన్ కాస్తా 29 రూపాయలయింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు వోచర్ల వ్యాలిడిటీలో మార్పులు చేసింది.
19 రూపాయల వోచర్ వ్యాలిడిటీ ఇప్పటి వరకూ రెగ్యులర్ ప్లాన్ వ్యాలిడిటీ వరకూ ఉండేది. అంటే ఒకవేళ మీరు మీ మొబైల్‌లో వాడుతున్న రెగ్యులర్ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులుంటే 19 రూపాయల వోచర్ కూడా అన్ని రోజులు పనిచేస్తుంది. కానీ ఇప్పుడీ కూపన్ వ్యాలిడిటీని కేవలం 1 రోజుకు పరిమితం చేసింది. అదే విధంగా 29 రూపాయల వోచర్ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 2 రోజులకు పరిమితమైంది. 19 రూపాయలు వోచర్‌తో 1 జీబీ డేటా, 29 రూపాయల వోచర్‌తో 2 జీబీ డేటా లభించేది. ఇప్పుడు కూడా డేటా విషయంలో మార్పు లేదు గానీ వ్యాలిడిటీ తగ్గిపోయింది.
మరోవైపు జియో 5జి డేటా యూజర్లకు మరో ప్లాన్ అందిస్తోంది. ఇందులో భాగంగా 601 రూపాయల కొత్త మొబైల్ వోచర్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 1 ఏడాది వ్యాలిడిటీతో పాటు 5జి అన్‌లిమిటెడ్ లభిస్తుంది. ఇది కావాలంటే రోజుకు 1.5 జీబీ డేటా అందించే రీఛార్జ్ ప్లాన్ ఉండాలి.
రిలయన్స్ జియో తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు మండిపడుతున్నారు. క్రమంగా పెరుగుతున్న టారిఫ్‌తో జియో కూడా ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు చేరువౌతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Also read: Big Gift for Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఇకపై వేతన సంఘం స్థానంలో కొత్త విధానం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.