Jio Independence offer: జియో కస్టమర్స్‌కు బంపరాఫర్... ఆ రీఛార్జ్ ప్లాన్‌పై రూ.3 వేల అదనపు బెనిఫిట్స్ పూర్తిగా ఉచితం

Reliance Jio Independence offer: జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇండిపెండెన్స్ ఆఫర్ పేరిట కస్టమర్స్‌కు జియో బంపరాఫర్ ప్రకటించింది.   

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 12, 2022, 03:12 PM IST
  • రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ ఆఫర్
  • రూ.2999 విలువ చేసే రీఛార్జ్ ప్లాన్‌పై
  • రూ.3 వేలు విలువ చేసే బెనిఫిట్స్ పూర్తిగా ఉచితం
Jio Independence offer: జియో కస్టమర్స్‌కు బంపరాఫర్... ఆ రీఛార్జ్ ప్లాన్‌పై రూ.3 వేల అదనపు బెనిఫిట్స్ పూర్తిగా ఉచితం

Reliance Jio Independence offer: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 'ఇండిపెండెన్స్ డే'ని పురస్కరించుకుని ప్రీపెయిడ్ కస్టమర్స్‌కి బంపరాఫర్ ప్రకటించింది. రూ.2,999 రీఛార్జ్ ప్లాన్‌పై రూ.3 వేలు విలువ చేసే బెనిఫిట్స్‌ని ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్స్‌కి అదనపు డేటా, ఫ్రీ ఓటీటీ యాక్సెస్‌తో పాటు మరెన్నో బెనిఫిట్స్ అందనున్నాయి.  రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రిలయన్స్ జియో రూ.2999 రీఛార్జ్ ప్లాన్ :

రిలయన్స్ జియో చాలా కాలంగా రూ.2999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఏడాది పాటు రోజుకు 2.5 జీబీ చొప్పున డేటా, ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్, ఒక సంవత్సరం పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీకి మొబైల్ యాక్సెస్ పొందవచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ప్లాన్‌కి జియో మరిన్ని బెనిఫిట్స్‌ని జోడించింది.

రూ.3 వేలు విలువ చేసే బెనిఫిట్స్ :

ఇండిపెండెన్స్ డే సందర్భంగా రూ.2999 రీఛార్జ్ ప్లాన్‌పై అదనంగా రూ.750 విలువ చేసే 75 జీబీ డేటాతో పాటు రిలయన్స్ ఈకామర్స్ సైట్ అజియోలో దుస్తుల కొనుగోలుపై రూ.750 తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు, ఆన్‌లైన్‌లో మందులు విక్రయించే నెట్‌మెడ్స్‌ సైట్‌లో మరో రూ.750 తగ్గింపు, ఇక్సిగో ట్రావెల్ పోర్టల్‌లో టికెట్స్ బుకింగ్‌పై మరో రూ.750 తగ్గింపు అందిస్తోంది. ఇవన్నీ కలిపితే రూ.3 వేలు వరకు బెనిఫిట్స్ ఉచితంగా  పొందవచ్చు.

Also Read: Pavan Tej Konidela: హీరోయిన్ తో ఏడడుగులు వేయనున్న మెగా హీరో .. ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా?

Also Read: Macherla Niyojakavargam: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఆకట్టుకుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News