Bank Holidays: ఏప్రిల్ 2023లో 15 రోజులు పనిచేయని బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: మరి కొద్దిరోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పూర్తయి..కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2023, 11:41 AM IST
Bank Holidays: ఏప్రిల్ 2023లో 15 రోజులు పనిచేయని బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటే

Bank Holidays: కొత్త సంవత్సరం జనవరిలో ప్రారంభమైనా..కొత్త ఆర్ధిక సంవత్సరం మాత్రం ఏప్రిల్‌తో మొదలవుతుంది. మరి కొద్దిరోజుల్లో 2022-23 ఆర్ధిక సంవత్సరం ముగియనుంది. 2023-23 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంతో పాటు కొన్ని మార్పులు రానున్నాయి. ఈ మార్పులు బ్యాంకులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించినవే. 

ముఖ్యంగా 2023-24 ఆర్ధిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాలి. లేకపోతే చాలా పనులు పెండింగులో పడిపోతాయి. ఏప్రిల్ నెలలో చేయాల్సిన బ్యాంకు పనులుంటే సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. దేశంలో అత్యధికశాతం బ్యాంకు పనుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు ఎలాగూ సెలవుంటుంది. వీటితో కలుపుకుని ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజులు సెలవులున్నాయి.

ఏప్రిల్ నెలలో మొదటి సెలవు ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకు ఎక్కౌంట్ క్లోజింగ్‌తో ప్రారంభమౌతుంది. ఏప్రిల్ 4వ తేదీన మహావీర్ జయంతి ఉంది. ఆర్బీఐ జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం ఆదివారంతో పాటు ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంది. నెగోషియెబుల్ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ 1,4,5,7,15,18,21,22 తేదీల్లో బ్యాంకులకు సెలవులున్నాయి. 

ఏప్రిల్ 2023లో బ్యాంకు సెలవుల జాబితా

1. ఏప్రిల్ 1        బ్యాంకు ఎక్కౌంట్ క్లోజింగ్ 
2. ఏప్రిల్ 2        ఆదివారం సెలవు
3. ఏప్రిల్ 4        మహావీర్ జయంతి
4. ఏప్రిల్ 5        బాబూ జగజ్జీవన్ రామ్ జన్మదినం
5. ఏప్రిల్ 7        గుడ్ ఫ్రైడే
6. ఏప్రిల్ 8        రెండవ శనివారం
7. ఏప్రిల్ 9        ఆదివారం
8. ఏప్రిల్ 14      అంబేద్కర్ జయంతి
9. ఏప్రిల్ 15      హిమాచల్ డే, బెంగాల్ నవ వర్ష్ డే
10. ఏప్రిల్ 16    ఆదివారం
11. ఏప్రిల్ 18    షబే ఖద్ర్
12. ఏప్రిల్ 21    ఈదుల్ ఫిత్ర్
13. ఏప్రిల్ 22    శనివారం
14. ఏప్రిల్ 23    ఆదివారం
15. ఏప్రిల్ 30    ఆదివారం

Also read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 2023 డీఏ పెంపు జనవరి, జూలైలో ఎంత ఉండనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News