Hyderabad Water Supply: పాతికేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ నగర విస్తరణతోపాటు 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా భవిష్యత్ ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్ను రూపొందించాలని.. అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read: Game Changer: మరో సంధ్య థియేటర్ కావొద్దు.. గేమ్ ఛేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సూచనలు ఇవే!
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం జలమండలి బోర్డు సమావేశం నిర్వహించగా.. బోర్డు చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి వనరులపై సమీక్షించారు. గోదావరి జలాల తరలింపు.. గోదావరి కృష్ణకు అనుసంధానం వంటి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు లోటు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు.
Also Read: K Kavitha: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన.. 'నేను చెప్పింది తప్పయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'
నగరానికి కాళేశ్వరం నీళ్లు
సమావేశంలో నాటి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ ద్వారా.. లేదా కొండపోచమ్మ సాగర్ ద్వారా నీటిని తీసుకోవాల అనే దానిపై సమాలోచనలుచేశారు. చివరకు మల్లన్నసాగర్ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 20 టీఎంసీల నీటిని తెచ్చుకునేలా మార్పులకు ఆమోదం తెలిపారు. మంజీరా ద్వారా నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్లకు కాలం చెల్లిందని.. ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ ఇలా
- హైదరాబాద్ నగరంలో మొత్తం 9,800 కిలోమీటర్ల తాగునీటి పంపిణీ వ్యవస్థ ఉంది.
- మొత్తం 13.79 లక్షల నల్లా కనెక్షన్లకు జలమండలి ద్వారా నీటి సరఫరా
- మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నగరానికి జరుగుతున్న తాగునీటి సరఫరా
- గోదావరి ఫేజ్ 2లో భాగంగా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా గోదావరి నీటిని తెచ్చుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరకు తాగునీటి సరఫరా చేయాలని ప్రణాళిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook