Samsung case: పడిపోయిన శాంసంగ్ షేర్లు, వైస్ ఛైర్మన్‌కు జైలు శిక్ష ప్రభావం

Samsung case: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ షేర్ మార్కెట్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్‌కు జైలు శిక్ష ప్రభావం షేర్ మార్కెట్‌పై పడింది.

Last Updated : Jan 18, 2021, 04:51 PM IST
Samsung case: పడిపోయిన శాంసంగ్ షేర్లు, వైస్ ఛైర్మన్‌కు జైలు శిక్ష ప్రభావం

Samsung case: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ షేర్ మార్కెట్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. అవినీతి కేసులో శాంసంగ్ వైస్ ఛైర్మన్‌కు జైలు శిక్ష ప్రభావం షేర్ మార్కెట్‌పై పడింది. 

దక్షిణ కొరియా ( South korea ) లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దేశంలోని ఎలక్ట్రానిక్స్ మార్కెట్ దిగ్గజమైన శాంసంగ్  వైస్ ఛైర్మన్ ( Samsung vice chairman )‌కు సియోల్ హైకోర్టు ( Seoul high court ) జైలు శిక్ష విధించింది. అవినీతి, లంచం కేసులో వైస్ ఛైర్మన్ జే వై లీకు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. కంపెనీ మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్ హే సహచరుడికి లంచం ఇచ్చారన్న ( Bribe case ) ఆరోపణలపై సియోల్ హైకోర్టు విచారించి..శిక్ష విధించింది. 

శాంసంగ్ వైస్ ఛైర్మన్ జే వై లీ ( Samsung vice chairman jay y lee )..దాదాపు 7.8 మిలియన్ డాలర్ల లంచం, అవినీతి, ఆదాయాన్ని దాచడం వంటి నేరాలకు పాల్పడినట్టు సియోల్ కోర్టు విశ్వసించింది. రెండున్నరేళ్ల శిక్ష తీర్పు ఇస్తూ..వారం రోజుల్లోగా సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్లవచ్చని సూచించింది. అయితే ఇప్పటికే ఇదే కేసులో సుప్రీంకోర్టు ( Supreme court ) లో తీర్పు వచ్చినందున సమీక్షించే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 

Also read: Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..

వాస్తవానికి ఇదే కేసులో 2017లోనే జే వై లీ దోషిగా తేలడంతో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అయితే తానెలాంటి నేరానికి పాల్పడలేదని..శిక్షను తగ్గించాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను ఓ ఏడాదికి తగ్గించడంతో 2018 ఫిబ్రవరిలో విడుదలయ్యాడు. తరవాత సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేసి..2019లో విచారణకు ఆదేశిస్తూ సియోల్ హైకోర్టుకు తిరిగి పంపింది. ఇవాళ తాజాగా తీర్పు వెలువరించింది సియోలో కోర్టు. 

అమెరికా చైనా మార్కెట్ సంబంధాల మధ్య ఏర్పడిన అనిశ్చితి కారణంగా ప్రత్యేక వ్యూహాలతో శాంసంగ్ ( Samsung ) దూసుకుపోతోంది.  ఇప్పుడు లీ లేకపోతే..భారీ పెట్టుబడులు నిలిచిపోవచ్చనే ఆందోళన నెలకొంది. ఫలితంగా ఆ ప్రభావం షేర్ మార్కెట్ ( Share market )‌పై పడింది. శాంసంగ్ షేర్లు ( Samsung shares ) 4 శాతం పడిపోవడమే కాకుండా..శాంసంగ్ సీ అండ్ టీ, శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్ ఎస్‌డీఐ వంటి అనుబంధ సంస్థల షేర్లు నష్టాల్లో వెళ్లిపోయాయి. 

Also read: Petrol Price Today: భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో దేశంలోనే అధిక ధరలు

Trending News