SBI Alert: కేవైసీ లేని ఎక్కౌంట్లను క్లోజ్ చేస్తున్న ఎస్బీఐ, మీ ఎక్కౌంట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎస్బీఐ చాలా ఎక్కౌంట్లను క్లోజ్ చేసేసింది. మీ ఎక్కౌంట్ స్టేటస్ ఎలా ఉందో వెంటనే చెక్ చేసుకోండి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 7, 2022, 10:18 PM IST
SBI Alert: కేవైసీ లేని ఎక్కౌంట్లను క్లోజ్ చేస్తున్న ఎస్బీఐ, మీ ఎక్కౌంట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎస్బీఐ చాలా ఎక్కౌంట్లను క్లోజ్ చేసేసింది. మీ ఎక్కౌంట్ స్టేటస్ ఎలా ఉందో వెంటనే చెక్ చేసుకోండి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు ఎక్కౌంట్ ఉంటే వెంటనే అప్రమత్తం అవాల్సిన అవసరముంది. ఎందుకంటే ఈ వార్త మీ కోసమే. ఎస్బీఐ ఇటీవల చాలా బ్యాంకు ఖాతాల్ని క్లోజ్ చేసేసింది. ఫలితంగా ఏ విధమైన లావాదేవీలు ఇకపై జరగవు. వాస్తవానికి కేవైసీ ప్రక్రియ పూర్తి కాని ఖాతాల్నే ఎస్బీఐ క్లోజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇదే విషయమై పోస్టింగులు పెడుతున్నారు. 

సోషల్ మీడియాలో చాలామంది ఖాతాదారుల్నించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ ఏ విధమైన ప్రాధమిక సమాచారం లేదా ముందస్తు నోటీసు లేకుండానే తమ తమ ఖాతాల్ని క్లోజ్ చేసిందంటూ ఆరోపిస్తున్నారు. కేవైసీ ప్రక్రియ నియమాన్ని అమలు చేసేందుకు ఎంపిక చేసిన సమయం సరైంది కాదనేది ఇంకొంతమంది ఖాతాదారుల ఆరోపణ. ఎందుకంటే చాలామందికి జీతాలు వచ్చే సమయమిది. ఇలాంటి సమయంలో ఎక్కౌంట్ క్లోజ్ అయితే జీతం డబ్బులు ఎలా తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు నుంచి ముందస్తు సమాచారం లేకపోవడం వల్లనే ఇప్పుడు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అయితే కేవైసీ ప్రక్రియ, బ్యాంకు ఎక్కౌంట్ క్లోజ్ చేయడం గురించి ఖాతాదారులకు ముందే సూచనలు జారీ చేశామని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. ఖాతాదారులకు లెటర్స్ కూడా పంపించామంటున్నారు. బ్యాంకు నుంచి పదే పదే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయమని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అయితే ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌పై మాత్రం కేవైసీ విషయంలో ఎటువంటి వార్నింగ్ లేదా సూచనలు లేవని ఇంకొంతమంది ఖాతాదారులు చెబుతున్నారు. లావాదేవీలు జరిపినప్పుడే బ్యాంకు ఎక్కౌంట్ క్లోజ్ అయినట్టు తెలుస్తోందని చెబుతున్నారు. 

జూలై నుంచి మారుతున్న నియమాలాల్లో కేవైసీ విషయంలో చాలా అప్‌డేట్స్ వస్తున్నాయి. మోసాలు,సైబర్ నేరాల కారణంగా రిజర్వ్ బ్యాంకు కూడా కేవైసీ అప్‌డేట్ చేసుకోమంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. గతంలో పదేళ్లకోసారి కేవైసీ అప్‌డేట్ జరిగేది. ఇప్పుడు మూడేళ్లకోసారి అప్‌డేట్ అవుతోంది. 

Also read: Lava Blaze : బడ్జెట్ ధరలో లావా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ ఆఫర్ కింద రూ.1 వెయ్యి తగ్గింపు.. ఫీచర్స్ ఇవే...

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News