Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కార్లు కొంటున్నారా ? ఇలాంటి కార్లతో తస్మాత్ జాగ్రత్త

Second Hand Cars Buying Tips: కొత్త కారు నేర్చుకునే వాళ్లు కానీ లేదా కొత్త కారు కొనేందుకు ఎక్కువ బడ్జెట్ లేని వాళ్లు కానీ పాత కార్లు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. లేదంటే ఎక్కువగా ఉపయోగించే పని లేకుండా ఎప్పుడో ఒకసారి అలా సరదాగా బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కారు ఉంటే చాలు అనుకునే వాళ్లు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనడానికే ఇష్టపడుతున్నారు.  

Written by - Pavan | Last Updated : May 9, 2023, 09:50 PM IST
Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కార్లు కొంటున్నారా ? ఇలాంటి కార్లతో తస్మాత్ జాగ్రత్త

Second Hand Cars Buying Tips: కారు అనేది ఒకప్పుడు లగ్జరీనే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో కారు అనేది సర్వ సాధారణ అవసరంగా మారిపోయింది. ఇంటింటికి ఒక బైక్ ఉండటమే గొప్ప అనుకునే రోజుల్లో కారు కలిగి ఉన్న వాళ్లు నిజంగానే రిచ్.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ఎవరికి ఉన్నంతలో వారు చెల్లించి మిగతా మొత్తాన్ని ఈఎంఐపై చెల్లించి కారును సొంతం చేసుకుంటున్నారు. పైగా బ్యాంకులు కూడా మిగతా లోన్స్ కంటే విహికిల్ లోన్స్ కి తక్కువ వడ్డీని చార్జ్ చేస్తున్నాయి. 

ఒకప్పటితో పోల్చుకుంటే కారు లోన్ ఎలిజిబిలిటి కండిషన్స్ కూడా చాలా వరకు సవరించారు. దీంతో ఇప్పుడు ఇతరత్రా లోన్స్ తీసుకోవడం కంటే.. కారు లోన్ తీసుకోవడమే ఈజీగా మారింది. కారు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటం .. లేదంటే ఎక్కువ మొత్తంలో శాలరీ ప్యాకేజ్ ఉన్న వాళ్లు ఎవరైనా.. కొత్త కారుకే మొగ్గు చూపిస్తుండగా.. కొత్త కారు కోసం అనుకున్నంత బడ్జెట్ లేని వాళ్లు లేదా తమ అవసరాలకు కొత్త కారు కంటే పాత కారే నయం అనుకునే వారు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారు ఏయే కార్లను దూరం పెడితే బెటర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

షెవర్లే క్రూజ్ :
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న అభిప్రాయాల ప్రకారం ఏయే కార్ల కంపెనీలు అయితే ఇప్పటికే ఇండియాలో మానుఫాక్చరింగ్, సేల్స్‌ని ఆపేశాయో.. ఆయా కంపెనీలకు చెందిన కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కొనుగోలు చేయకపోవడమే బెటర్. ఎందుకంటే కారులో ఏదైనా సమస్యలు తలెత్తితే మిగతా కంపెనీ కార్లతో పోల్చితే దేశం నుంచి ఎగ్జిట్ అయిన కంపెనీ కార్ల విషయంలో ఇబ్బందులు తప్పవు. షెవర్లే విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఇక ప్రత్యేకించి ఈ క్రూజ్ కారు విషయానికొస్తే.. ఈ కారులో గేర్ ట్రాన్స్‌మిషన్‌లో, పవర్‌ట్రెయిన్ పరమైన సమస్యలు తలెత్తినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 

ఫియాట్ లినియా :
ఫియాట్ లినియా కారు బయటి నుంచి చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుందో.. సెకండ్ హ్యాండ్ కారులో అంత ఇబ్బందులు ఉంటాయంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్. సాంకేతికంగా ఈ కారులో ఉన్న సమస్యలే అందుకు కారణంగా తెలుస్తోంది.

ఫియాట్ పంటో : 
ఫియాట్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసిన బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. కానీ కారును ఉపయోగించే క్రమంలో రిలయబిలిటీ కోల్పోయిన కార్ల జాబితాలోనూ ఫియాట్ పంటో ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటికే ఫియాట్ కంపెనీ దేశం విడిచి వెళ్లిపోగా.. ఫియాట్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫ్యాక్చరర్ (OEM) కూడా ఇండియా నుంచి ఎగ్జిట్ అయింది. అంటే.. ఒకవేళ ఈ కారులో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ అవసరం పడితే.. ఆ పార్ట్స్ లభించడం కష్టతరం అవుతుంది. అందుకే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఇది రైట్ ఛాయిస్ అనిపించుకోదు. 

మహింద్రా థార్ కారు : 
మహింద్రా అండ్ మహింద్రా లాంచ్ చేసిన ది బెస్ట్ వెహికిల్స్‌లో థార్ కూడా ఒకటి. థార్ వాహనాన్ని కొనుగోలు చేసిన వారు ఆ వాహనాన్ని చాలా రఫ్‌గా నడిపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అదే కానీ జరిగితే కాలక్రమంలో థార్ షాక్ అబ్జార్వర్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. అందుకే థార్ సెకండ్ హ్యండ్ వెహికిల్ కొనే ముందు సస్పెన్షన్, వీల్, యాక్సిల్ పరమైన అంశాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

టయోటా ఫార్చూనర్ కారు :
టయోటా ఫార్చూనర్ లాంటి ఎస్‌యూవీ కార్లను నడిపే యజమానులు స్మూత్‌గా నడిపే అవకాశాలు చాలా తక్కువే అనే అభిప్రాయం. అందుకే అలా రఫ్ గా నడిపిన టయోటా ఫార్చూనర్ కారులో సమస్యలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని.. ముఖ్యంగా సస్పెన్షన్, వీల్స్, యాక్సివ్ వంటి అంశాలను చాలా క్షుణ్ణంగా చెక్ చేయాలని చెబుతున్నారు. 

లగ్జరీ కార్లు :
ఖరీదైన లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేయొద్దు. కొంతకాలం ఉపయోగించిన తరువాత ఆ కార్లలో ఏవైనా సమస్యలు తలెత్తితే.. వాటి రిపేర్ కోసం, విడి భాగాల కోసం ఊహించని రీతిలో భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఖరీదైన కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కొనుగోలు చేయొద్దు అంటున్నారు ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్.

Trending News