ఇంటర్నెట్ ప్రపంచంలో సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. అదే సమయంలో ముప్పు కూడా ఉంటుంది. ఇంట్లో కూర్చుని సంపాదించడం ఎంత తేలికో..రిస్క్ కూడా అంతే ఉంటుంది.
ఇటీవలి కాలంలో సంపాదనకు సోషల్ మీడియా కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే ఇది ఎంత సులభమో అంతే రిస్క్ కూడుకున్న వ్యవహారం. అందుకే సోషల్ మీడియా విషయంలో కొన్ని విషయాల్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాతో ధన సంపాదన చేయాలనుకుంటే..చాలా విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. రోజువారీ ఉద్యోగంతోపాటే ఈ పని చేయవచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి సంపాదించాలనుకుంటే..కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
స్థిరత్వం లేదా అనిశ్చితి
మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీ ఆదాయం అనేది ఫిక్స్డ్‌గా ఉంటుంది. కాబట్టి మీరు సేఫ్‌గా ఉంటారు. కానీ ఇన్ ఫ్లుయెన్సర్‌గా మారితే సంపాదన నిశ్చితంగా ఉండదు. ఒక్కో నెల ఒక్కోలా ఉంటుంది.
ఉద్యోగస్థులకు నిర్ధిష్టమైన సమయం ఉంటుంది. ఆఫీసు వెళ్లే టైమింగ్స్ ముందే నిర్ధారితమౌతాయి. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్ పనిలో నిశ్చితమైన సమయం అంటూ ఉండదు. ప్రత్యేకించి ప్రారంభంలో అయితే ఇంకా అస్పష్టంగా ఉంటుంది. కంటెంట్ రీసెర్చ్ చేయడం, స్క్రిప్టింగ్, షూటింగ్ , ఎడిటింగ్ ఇలా అన్నీ స్వయంగా చేయాల్సి వస్తుంది.
ఉద్యోగంలో నిర్దేశించిన పని పూర్తి చేసేందుకు ఓ విధానముంటుంది. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్ పనిలో అలా ఉండదు. క్రియేటివిటీ చాలా అవసరం. క్రియేటివిటీ ఉంటే ఈ పనిలో అద్భుతంగా రాణించవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో బిజినెస్ ఎక్కౌంట్ ఓపెన్ చేసినా లేదా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసినా..విభిన్నమైన కంటెంట్ ఉండాలి. కంటెంట్ అనేది ఎప్పుడూ మీకిష్టమైన రంగానిదే అయుండాలి. అందులో ఉండే కాంపిటిషన్‌ను విశ్లేషించుకోవాలి. అదే రంగంలోని ఇతర కంటెంట్‌లకు భిన్నంగా మీరిచ్చే కంటెంట్ ఉండేట్టు చూసుకోవాలి. వీడియో కంటెంట్ అయితే క్వాలిటీ బాగుండాలి. కంటెంట్ కోసం షూటింగ్, ఎడిటింగ్ బాగుండాలి. వీడియో కంటెంట్ టైటిల్ ఎలా ఉండాలంటే..సాధారణ జనం ఏ విధంగా సెర్చ్ చేస్తారో ఆ పదాలుండాలి.
Also read: Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలో ఎందుకు లేవు, రాష్ట్రాలే కారణమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook