SBI MCLR Hike: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు అన్ని రకాల టెన్యూర్స్‌కి వర్తించనుంది. ఎంసీఎల్ఆర్ పెంపుతో వ్యక్తిగత, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే బ్యాంక్ రుణం పొందినవారిపై ఈఎంఐ భారం పెరగనుంది.
ఎంసీఎల్ఆర్ పెంపు వివరాలు
ఓవర్‌నైట్‌తో పాటు ఒక నెల, 3 నెలల టెన్యూర్స్‌పై 7.05 శాతం నుంచి 7.15 శాతానికి ఎంసీఎల్ఆర్ పెంపు
ఆరు నెలల టెన్యూర్‌పై 7.35 శాతం నుంచి 7.45 శాతానికి ఎంసీఎల్ఆర్ పెంపు
ఏడాది కాల పరిమితికి 7.40 శాతం నుంచి 7.50 శాతం పెంపు
రెండేళ్ల కాలపరిమితికి 7.60 నుంచి 7.70 శాతానికి పెంపు
మూడేళ్ల కాల పరిమితికి 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెంపు
గత జూన్‌లో ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచడంతో ఈ పెంపు చేపట్టింది. తాజాగా మరోసారి ఎంసీఎల్ఆర్‌ను పెంచడంతో రుణగ్రహీతలపై ఆ ప్రభావం పడనుంది. ఎంసీఎల్‌ఆర్ అనేది కనీస వడ్డీ రేటుగా పరిగణించబడుతుంది. ఇంతకన్నా తక్కువ రేటుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. ఆర్బీఐ రెపో రేటును సవరించాక ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర ప్రైవేట్ బ్యాంకులు సైతం ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: Pratap Pothen: రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూత
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.