SBI FD Scheme: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలు ప్రారంభిస్తుంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రాచుర్యం పొందిన ఓ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. ఎస్బీఐ అమృత్ కలష్ పేరుతో ప్రారంభమైన ఈ పథకం పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఎస్బీఐ రీ ఇంట్రడ్యూస్ చేసిన అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తోంది. సాధారణ పౌరులకు 7.29 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.82 శాతం వడ్డీ అందిస్తోంది బ్యాంకు. అమృత్ కలష్ పథకం గతంలో ఉన్నదే. మధ్యలో కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో తిరిగి ప్రారంభమైంది. ఇది 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డి పథకం. గతంలో ఇదే రిటైల్ టెర్మ్ డిపాజిట్ పధకం కొద్దిరోజుల వ్యవధి కోసం అమల్లో ఉంది. 2023 ఫిబ్రవరి 15 నుంచి 2023 మార్చ్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పథకంపై సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనంగా చేర్చి 7.6 శాతం వడ్డీ అందించింది.
ఇ్పప్పుడు 400 రోజుల ప్రత్యేక కాల వ్యవధికై ఏప్రిల్ 2023 నుంచి తిరిగి ప్రారంభించింది. ఇందులో సీనియర్ సిటిజన్లకు 7.82 శాతం వడ్డీ ఇస్తుండగా, సాధారణ కస్టమర్లకు 7.29 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేవలం ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 31 వరకూ 45 రోజుల కోసం ప్రారంభమైంది. ఇప్పుుడు ఏకంగా 400 రోజుల కాల వ్యవధికై తిరిగి ఇంట్రడ్యూస్ అయింది.
ప్రస్తుతం ఎస్బీఐ 2 నుంచి 3 ఏళ్ల కాల పరిమితిలో ఫిక్స్డ్ డిపాజిట్లకు గరిష్టంగా 7 శాతం వడ్డీ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఎస్బీఐ వెల్ఫేర్‌లో భాగంగా 5-10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ ఇది. అమృత్ కలష్ ఎఫ్‌డిపై ఆసక్తి ఉంటే సమీప ఎస్బీఐ బ్యాంకుల్లో తీసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ పథకంలో అవవరమైనప్పుడు డ్రా చేసుకునే విధంగా ప్రీ మెచ్యూర్ విత్ డ్రాయల్ సౌకర్యం కూడా ఉంది.
ఎస్బీఐ గత నెలలో ఎస్బీఐ వెల్ఫేర్ ఎఫ్‌డి పధకం కాల వ్యవధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పధకంలో సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరులకు ఇచ్చే వడ్డీ రేటు కంటే అదనంగా 100 బేసిస్ పాయింట్లు ఇస్తున్నారు.
Also read: Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొన్నారా ? ఈ ఐదూ ఎప్పుడూ మీతో ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook