Stock Market today: స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు- 58,800 పైకి సెన్సెక్స్​

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల (Stocks closing bell) సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 03:58 PM IST
  • స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
  • రాణించిన ఎఫ్​ఎంసీజీ, ఐటీ షేర్లు
  • డీలా పడిన పవర్​, బ్యాంకింగ్ రంగాలు
Stock Market today: స్టాక్ మార్కెట్లకు స్వల్ప లాభాలు- 58,800 పైకి సెన్సెక్స్​

Stock Market Updates: స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల (Stocks closing bell) సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 157 పాయింట్లు పెరిగి.. 58,807 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 47 పాయింట్ల లాభంతో 17,516 వద్ద స్థిరపడింది.

ఒమిక్రాన్ భయాల కారణంగా ఇటీవల భారీ ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి స్టాక్ మార్కెట్లు. ఈ నేపథ్యంలో ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల.. నేటి సెషన్​ మొత్తం ఊగిసలాటలో సాగింది. ఎట్టకేలకు ఎఫ్​ఎంసీజీ, ఐటీ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్ల అండతో స్వల్ప లాభాలతో ముగిశాయి. విద్యుత్​, బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 58,889 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. రికార్డు స్థాయిలో అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 58,340 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,543 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,379 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 15 కంపెనీలు సానుకూలంగా స్పందించగా.. 15 కంపెనీలు డీలా పడ్డాయి.

ఐటీసీ 4.60 శాతం, ఎల్​&టీ 3.18 శాతం, ఏషియన్​ పెయింట్స్ 1.97 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.59 శాతం, బజాజ్ ఫినాన్స్​ 1.03 శాతం లాభాలను గడించాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 1.72 శాతం, టైటాన్​ 1.32 శాతం, నెస్లే 0.99 శాతం, ఎన్​టీపీసీ 0.94 శాతం, పవర్​ గ్రిడ్​ 0.83 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి.

 టోక్యో (జపాన్​) సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.

రూపాయి విలువ

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 0.07 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 75.52 వద్ద కొనసాగుతోంది.

Also read: RBI Key Policy Rates: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ కీలక ప్రకటన.. వరుసగా తొమ్మిదోసారి యథాతథంగా వడ్డీ రేట్లు

Also read: PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్- ఈ నెల 25 లోపు ఖాతాల్లో రూ.2 వేలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News