Stock Market today: స్టాక్ మార్కెట్లు సోమవారం (Stocks Closing bell) లాభాలతో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 296 పాయింట్లు పెరిగి 57,420 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 82 పాయింట్ల స్వల్ప లాభంతో 17,086 వద్ద స్థిరపడింది.
దాదాపు అన్ని రంగాలు లాభాలను నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 57,512 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,543 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,112 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,833 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 6 కంపెనీలు డీలా పడ్డాయి.
టెక్ మహీంద్రా (3.57 శాతం), డాక్టర్ రెడ్డీస్ (1.95 శాతం), పవర్‌గ్రిడ్ (1.56 శాతం), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.56 శాతం), సన్‌ఫార్మా (1.16 శాతం) లాభాలను నమోదు చేశాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.55 శాతం), ఏషియన్ పెయింట్స్ (0.44 శాతం), మారుతీ (0.32 శాతం), భారతీ ఎయిర్టెల్ (0.23 శాతం), ఐటీసీ (0.21 శాతం) నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి.
షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా) సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు స్థిరంగా ఉంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.99 వద్ద కొనసాగుతోంది.
Also read: Todays Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
Also read: Banking alert: జనవరి 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్- ఏటీఎం లావాదేవీలకు అదనపు ఛార్జీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook