Real Estate News: బెంగళూరు రియల్ ఎస్టేట్లో రికార్డు నమోదయింది. తాజాగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకరకంగా చెప్పాలంటే ఇది సంచలనం అనే చెప్పవచ్చు. తాజాగా రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ బెంగళూరులోని సుమధుర లాజిస్టిక్స్ పార్క్‌లో గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ ఎన్‌ఎక్స్ లాజిస్టిక్స్ ఇండియా (నిప్పన్ ఎక్స్‌ప్రెస్)కి 1.8 లక్షల చదరపు అడుగుల వేర్‌హౌసింగ్ స్థలాన్ని తొమ్మిదేళ్లపాటు లీజుకు తీసుకుంది. ఈ విషయాన్ని కంపెనీ సెప్టెంబర్ 12న ఒక ప్రకటనలో తెలిపింది.
సుమధుర లాజిస్టిక్స్ పార్క్స్ మొదటి దశ అభివృద్ధిలో భాగంగా ఈ ఒప్పందం చోటుచేసుకుంది. హోస్కోట్ పట్టణంలోని 100 ఎకరాల ల్యాండ్ లో 2.5 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య గిడ్డంగుల స్థలంలో విస్తరించి ఉంది. ఇది రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. 2030 నాటికి 10 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తమ గ్రూపు మారుతుందని భావిస్తున్నట్లు, సుమధుర గ్రూప్. చైర్మన్ మధుసూధన్ అన్నారు.
హోస్కోట్ పారిశ్రామిక గోడౌన్ల కేంద్రంగా ఉద్భవించింది:
కార్పొరేట్ దిగ్గజాల తయారీ ప్లాంట్ యూనిట్లకు నిలయంగా హోస్కోట్ ఇటీవలి సంవత్సరాలలో అవతరించింది. ముఖ్యంగా పారిశ్రామిక గోడౌన్లు, వేర్ హౌస్ కేంద్రంగా ఈ ప్రాంతం ఉద్భవించింది. ప్రాప్‌టెక్ యునికార్న్ నోబ్రోకర్ నుండి సేకరించిన డేటా ప్రకారం, ఈ ప్రాంతంలో సగటు వాణిజ్య ప్రాపర్టీ ధరలు సంవత్సరానికి 7శాతం పెరిగి ప్రస్తుతం చదరపు అడుగులకు రూ. 15,000 వద్ద ప్రారంభమయ్యాయి.
అంతేకాదు ఈ ప్రాంతంలో హత్యలు అద్దెలు ఏటా 9శాతం పెరిగాయి. ప్రస్తుతం, ఈ ప్రాంతంలోని 2,000-చదరపు అడుగుల గోడౌన్/వేర్‌హౌస్ సగటు అద్దె రూ. 20,000గా ఉంది. ఇక 30 సంవత్సరాల వ్యవధిలో, సుమధుర గ్రూప్ రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్‌హౌసింగ్ కో-లివింగ్ వంటి విభాగాల్లో 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం, బెంగళూరు . హైదరాబాద్‌లో విస్తరించి ఉన్నందున, కంపెనీ ప్రస్తుతం పైప్‌లైన్‌లో 40 మిలియన్ చదరపు అడుగుల డెవలప్మెంట్ ఉన్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే గడచిన దశాబ్ద కాలంగా బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఐటి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతూ ఉండటంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. అటు హౌసింగ్ తో పాటు కమర్షియల్ రంగంలో కూడా రియల్ ఎస్టేట్ ప్లాట్ లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.