Suraksha Diagnostic IPO: కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొంది. వరుసపెట్టి మార్కెట్లోకి వస్తున్న ఐపీఓలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది దిగ్గజ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇదే బాటలో ఇప్పుడు సురక్ష డయాగ్నోస్టిక్ ఐపీఓ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. నవంబర్ 29న ఈ ఐపీఓ ప్రారంభం కానుంది. ఒక్కో షేరు రూ. 420 నుంచి 442 ధరతో ఆఫర్ చేస్తోంది.
కోల్‌కతాకు చెందిన సురక్ష డయాగ్నోస్టిక్ తన IPOను నవంబర్ 29న ప్రారంభించనుంది. ఇది డిసెంబర్ 3 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది.ఈ బుక్ బిల్ట్ ఇష్యూ విలువ రూ. 846.25 కోట్లు. IPO పూర్తిగా OFS కాగా దీనిలో విక్రయించే వాటాదారులు 19,189,330 ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. సోమ్‌నాథ్ ఛటర్జీ, రీతూ మిట్టల్, సతీష్ కుమార్ వర్మ వంటి ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్‌లు ఉన్నారు. కాగా, ఆర్బిమెడ్ ఆసియా II మారిషస్ లిమిటెడ్, మున్నా లాల్ కేజ్రీవాల్, సంతోష్ కుమార్ కేజ్రీవాల్ వాటాదారులను విక్రయించే పెట్టుబడిదారులు. IPO OFS అయినందున, మొత్తం ఆదాయం విక్రయించిన వాటాదారులకు వెళ్తుంది.
ఇది చదవండి: Tirumala: అల్లరల్లరి అవుతున్న తిరుమల.. ప్రాంక్ వీడియోలకు అడ్డాగా పవిత్ర క్షేత్రం
ఈ ఐపీఓ లాట్ సైజ్ 33 షేర్లు. బిడ్స్ వేయాలనుకుంటే ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,994 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి షేర్ల కేటాయింపు డిసెంబర్ 4, 2024న జరుగుతుంది. డిసెంబర్ 6న స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు లిస్టింగ్ కు రానున్నాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు గరిష్ట వాటా 50శాతం ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కనీసం 35శాతం వాటా ఉంటుంది. కనీసం 15శాతం వాటా ఎన్ఐఐ కోసం రిజర్వ్ చేస్తారు.
కాగా సురక్ష డయాగ్నోస్టిక్ కంపెనినీ 2005తో స్థాపించారు. ఈ కంపెనీ పాథాలజీ, రేడియాలజీ, మెడికల్ కన్సల్టెన్సీ సర్వీసులను అందిస్తుంది. జూన్ 30, 2024 నాటికి కంపెనీ వ్యాపారం బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయలో విసర్తించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభం 7.67కోట్లుగా సంస్థ పేర్కొంది.
ఇది చదవండి: Vijay Paul Arrest: ఏపీలో కీలక పరిణామం.. రఘురామకృష్ణరాజు వేధింపుల కేసులో విజయ్ పాల్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.