Tata Altroz Racer 2024: ప్రముఖ భారతీయ కంపెనీ టాటా మోటార్స్ త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో మరో ఆప్డేట్ వేరియంట్ కారును అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ ఆల్ట్రోజ్ రేసర్‌ను మార్కెట్లోకి తీసుకు రానుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీనిని కంపెనీ జూన్ మధ్యలో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇది అద్భుతమైన పవర్‌ట్రైన్‌తో వస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ కారుకు సంబంధించిన బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆల్ట్రోజ్ రేసర్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్‌ట్రెయిన్ వివరాలు:
త్వరలోనే లాంచ్ కాబోయే టాటా ఆల్ట్రోజ్ రేసర్ అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ కారు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌పై రన్ అవుతుంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సెటప్‌తో రానుంది. ఇక ఇంజన్ వివరాలకు వెళితే, ఇది 118bhp శక్తితో పాటు 170Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంను కలిగి ఉంటుంది. దీని ఇంజన్ హ్యుందాయ్ i20 N లైన్‌తో సమానంగా భావించవచ్చు. ఇవేకాకుండా ఈ ఇంజన్లో అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
అద్భుతమైన ఫీచర్స్:
టాటా కంపెనీ ఈ మోడల్‌ను ఆటో ఎక్స్పో 2023తో పాటు భారత్ మొబిలిటీ షో 2024లో ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ స్మార్ట్ కారు ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సన్‌రూఫ్ సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
రేసర్ వేరియంట్ ప్రత్యేకత?:
స్టాండర్డ్ ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్లో బ్లాక్-అవుట్ హుడ్, రూఫ్ వంటి సెటప్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. అలాగే హుడ్‌పై రెండు LED లైట్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు హ్యాచ్‌బ్యాక్ అద్భుతమైన డిజైన్‌లో అందిస్తోంది. దీంతో కారుకి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ఆల్ట్రోజ్ రేసర్ వైట్ క్యాబిన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు రెడ్, బ్లాక్ కలర్ థీమ్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి