Top Most Selling SUV cars in India : ఇండియాలో అత్యధికంగా సేల్ అయ్యే టాప్ 10 SUV కార్ల జాబితా

Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం.

Written by - Pavan | Last Updated : Aug 8, 2023, 07:18 PM IST
Top Most Selling SUV cars in India : ఇండియాలో అత్యధికంగా సేల్ అయ్యే టాప్ 10 SUV కార్ల జాబితా

Top Most Selling SUV cars in India : ఇండియాలో ఇటీవల కాలంలో SUV వాహనాలకు భారీ క్రేజ్ నెలకొని ఉంది. గడిచిన జూలై నెలలో ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో 172,700 యూనిట్లకు పైగా SUV సెగ్మెంట్‌కి చెందిన వాహనాలే అమ్ముడు అవడం అందుకు నిదర్శనం. అత్యధికంగా SUV కార్లే ఎక్కువగా అమ్ముడైన నేపథ్యంలో అందులో ఏయే కంపెనీల కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి అనే వివరాలతో టాప్ 10 SUV కార్ల జాబితాను సిద్ధం చేశాం. ఈ టాప్ 10 జాబితాలో మారుతి సుజుకి ఇండియా నుండి మూడు మోడల్స్ ఉండగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండు కార్లు, టాటా మోటార్స్ నుండి రెండు కార్లు ఉన్నాయి, మహింద్రా అండ్ మహింద్రా నుంచి రెండు కార్లు ఉన్నాయి. కియా ఇండియా నుండి ఒక SUV కారుకు ఈ జాబితాలో చోటు దక్కింది.

అత్యధికంగా అమ్ముడైన బ్రెజ్జా 
మారుతి సుజుకిలో బ్రెజ్జాకు మొదటి నుండి మంచి ఫాలోయింగ్ ఉంది. జూలై నెలలో 16,543 బ్రెజ్జా కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అత్యధికంగా అమ్ముడైన SUV కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఉంది. జూలై నెలలో 14,062 హ్యూందాయ్ క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. మిడ్ - సైజ్ SUV సెగ్మెంట్ కార్లలో లీడర్‌గా ఉన్న హ్యూందాయ్ క్రెటా జులై నెల ఎస్ యూవీ అమ్మకాల్లో రెండో స్థానంలో నిలవగా.. ఇటీవలే కొత్తగా లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ 13,220 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది.

టాటా నెక్సాన్, టాటా పంచ్‌ : 
టాప్ 10 ఎస్ యూవీ కార్ల జాబితాలో నాలుగో స్థానంలో 12,349 కార్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ కొనసాగుతుండగా.. టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ SUV కారు టాటా పంచ్ 12,019 యూనిట్ల కార్ల అమ్మకాలతో ఐదో స్థానం సొంతం చేసుకుంది. 

మహీంద్రా కార్ల సంగతేంటి ..
ఆ తరువాతి స్థానాల్లో 10,522 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా స్కార్పియో-ఎన్ , మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కార్లు ఉన్నాయి.

హ్యూందాయ్ వెన్యూ
హ్యూందాయ్ క్రెటా తరువాత హ్యుందాయ్ వెన్యూకి మళ్లీ అంతటి క్రేజ్ ఉంది. జూలై నెలలో 10,062 యూనిట్ల హ్యూందాయ్ వెన్యూ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తరువాత కియా సెల్టోస్ 9,740 యూనిట్లు , మారుతి సుజుకి గ్రాండ్ విటారా 9,079 యూనిట్ల కార్లు సేల్ అయ్యాయి. మహీంద్రా అండ్ మహీంద్రా నుండి 8,921 మహీంద్రా బొలెరో , మహీంద్రా బొలెరో నియో కార్లు అమ్ముడయ్యాయి.

ఇది కూడా చదవండి : Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు

జూలైలో అమ్ముడైన టాప్ 10 SUV కార్ల జాబితా
మారుతి సుజుకి బ్రెజా - 16,543 కార్లు
హ్యుందాయ్ క్రెటా - 14,062 కార్లు
మారుతీ సుజుకి ఫ్రాంక్స్ - 13,220 కార్లు
టాటా నెక్సాన్ - 12,349 కార్లు
టాటా పంచ్ - 12,019 కార్లు
మహీంద్రా స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ - 10,522 కార్లు
హ్యుందాయ్ వేదిక - 10,062 కార్లు
కియా సెల్టోస్ - 9,740 కార్లు
మారుతి సుజుకి గ్రాండ్ విటారా - 9,079 కార్లు
మహీంద్రా బొలెరో , బొలెరో నియో - 8,921 కార్లు అమ్ముడయ్యాయి.

ఇది కూడా చదవండి : Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News