Tata Nexon EV: పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో టాటా నెక్సాన్ సంచలనం సృష్టిస్తోంది. నెక్సాన్‌తో నేరుగా పోటీపడే ఎలక్ట్రిక్ కారు ఇప్పటికి మార్కెట్‌లోకి రాలేదు. అయితే మార్కెట్‌లో మహీంద్రా XUV400 లాంచ్ అయినప్పటి నుంచి గేమ్ చేంజ్ అయ్యింది. మహీంద్రా XUV400 నేరుగా టాటా నెక్సాన్ EVతో పోటీపడుతోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా నెక్సాన్ ధరను కూడా తగ్గించింది. అయితే చాలా మంది నిపుణులు అభిప్రాయం.. ప్రకారం మహీంద్రా XUV400 మార్కెట్‌లోకి రావడం వల్ల టాటా నెక్సాన్ సేలింగ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. దీంతో టాటా నెక్సాన్ ధర తగ్గించి ప్రస్తుత ధర రూ.14.49 లక్షలతో విక్రయిస్తోంది.
టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ XM ధర ప్రారంభంలోనే తగ్గింది. ఇక ఈ కారు ఫీచర్ల విషయాలనికొస్తే.. టాటా నెక్సాన్ EV (XM వేరియంట్)లో ) ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, LED DRLలు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీతో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా పుష్-బటన్ స్టార్ట్ సీ యూ వంటి ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీని డిస్క్ బ్రేక్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.
టాటా నెక్సాన్ EV రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. Nexon EV ప్రైమ్, Nexon EV మాక్స్ రెండు వేరియంట్స్‌లో భారత మార్కెట్‌లో లభిస్తోంది. ప్రస్తుతం Nexon EV ప్రైమ్ ధర రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభం కాగా.. Nexon EV మ్యాక్స్ రూ. 16.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ టాప్ వేరియంట్ ఇప్పుడు రూ. 17.19 లక్షలు, మ్యాక్స్ టాప్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షలుగా ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి.
మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV రూ. 15.99 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 18.99 లక్షల వరకు ఉంటుంది. అయితే రెండు కార్ల ధరలు సమానంగా ఉండడం వల్ల చాలా మంది వినియోగదారులు ఈ మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUVని కొనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మంచి బడ్జెట్ కారును కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ కారును కొనొచ్చు.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి