Satyam vs Tech Mahindra: ఎందులో విలీనం చేద్దామనుకున్నారో..అదే సంస్థ టేకోవర్, ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Satyam vs Tech Mahindra: సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లతో తరచూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే ఆనంద్ మహీంద్రా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. సత్యం రామలింగరాజు గురించి చేసిన వ్యాఖ్యలు కావడంతో చర్చనీయాంశమౌతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2023, 12:51 PM IST
  • సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆనంద్ మహీంద్రా
  • సత్యం సంక్షోభానికి ముందు టెక్ మహీంద్రాను సత్యంలో విలీనం చేద్దామనుకున్నానని వ్యాఖ్యలు
  • ఏడాది తరువాత అదే సంస్థను తాను టేకోవర్ చేయాల్సి వచ్చిందన్న ఆనంద్ మహీంద్రా
Satyam vs Tech Mahindra: ఎందులో విలీనం చేద్దామనుకున్నారో..అదే సంస్థ టేకోవర్, ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా తెలియనివారుండరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా మరోసారి చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

దేశంలో ఒకప్పుడు ఐటీ దిగ్గజంగా పేరుగాంచిన సత్యం కంప్యూటర్స్ గురించి తెలియనివారుండరు. 2008-2009లో వెలుగుచూసిన 7 వేల కోట్ల రూపాయల సత్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధాని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజే. ఎందరో ఐటీ నిపుణులకు స్ఫూర్తిగా నిలిచిన సత్యం రామలింగరాజు సేవా కార్యక్రమాల్లో కూడా మేటి. గ్రామాల్ని దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి. అలాంటి మేధావి కుంభకోణంలో ఇరుక్కుపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ ఇది. సత్యం కంప్యూటర్స్ నుంచి నిధుల్ని మైటాస్ సంస్థకు తరలించడంతో పతనం ప్రారంభమై..చివరికి మూతపడే స్థితికి సత్యం రామలింగరాజు జైలుకెళ్లాల్సిన పరిస్థితికి దారితీసింది.

సత్యం రామలింగరాజు నేతృత్వంలో సత్యం కంప్యూటర్స్ ఉన్నత స్థానానికి చేరుకుంది. ఐటీ రంగంలో దూసుకుపోయింది. అలాంటి సత్యం కంప్యూటర్స్‌ను ఆనంద్ మహీంద్రా నేతృత్వంలోని టెక్ మహీంద్రా టేకోవర్ చేసింది. ఈ విషయమై చాలాకాలం తరువాత ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యం కంప్యూటర్స్ సంక్షోభం వెలుగుచూడటానికి ఏడాది ముందు తమ సంస్థ టెక్ మహీంద్రాను సత్యంలో విలీనం చేద్దామనుకున్నారని..రామలింగరాజుకు ప్రతిపాదన కూడా చేశానని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. అయితే ఆయన్నించి స్పందన రాలేదన్నారు. బహుశా ఆర్ధిక లొసుగుల కారణంగా స్పందించి ఉండకపోవచ్చన్నారు. 

హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటైనప్పుడు రామలింగరాజుతో తనకు పరిచయమేర్పడిందన్నారు ఆనంద్ మహీంద్రా. అప్పట్లో టెక్ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్ మధ్య వ్యాపారపరంగా సారూప్యతలుండేవన్నారు. అందుకే సత్యంలో తమ సంస్థను  విలీనం చేద్దామనే ఆఫర్ ఇచ్చినట్టు ఆనంద్ మహీంద్రా చెప్పడం విశేషం. 

అయితే ఆ తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. ఏ సంస్థలో అయితే విలీనం చేద్దామనుకున్నారో..అదే సంస్థను టేకోవర్ చేశారు ఆనంద్ మహీంద్రా. 

Also read: Insurance Plans: గ్యారంటీ ఇన్సూరెన్స్ పాలసీకు, సాధారణ బీమాకు తేడాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News