Budget2024: నిత్యవసరాల ధరలు ఎందుకు మండుతున్నాయి? బడ్జెట్ ముందు కేంద్రం విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ ఇదే..!!

Union Budget 2024: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఎకనామిక్ సర్వే 2024 ను విడుదల చేశారు.  దీని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దిశా దశను నిర్దేశించారు.  ముఖ్యంగా ధరల పెరుగుదలకు కారణమైన పరిస్థితులను,  భవిష్యత్తులో కార్యాచరణను ఈ సర్వే ద్వారా పేర్కొన్నారు.

Written by - Bhoomi | Last Updated : Jul 22, 2024, 04:31 PM IST
Budget2024: నిత్యవసరాల ధరలు ఎందుకు మండుతున్నాయి? బడ్జెట్ ముందు కేంద్రం విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ ఇదే..!!

Economic Survey 2024 Highlights: గడిచిన ఐదేండ్లుగా దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మాత్రం నిత్యవసరాల ధరల నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికీ ధరలు అదుపులోనే ఉన్నాయని పలుమార్లు తెలిపింది. ముఖ్యంగా ఆర్బిఐ తీసుకుంటున్న చర్యల వల్లనే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అదుపులోనే ఉందని రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం 5.4% వద్ద నమోదైనట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎకనామిక్స్ సర్వే 2024లో కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కోరుకుంటున్న ఈ తరుణంలో మన దేశం అద్భుతమైన గణాంకాలను ప్రదర్శిస్తుందని ఎకనామిక్ సర్వే పేర్కొంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బిఐ ద్రవ్యోల్బణం 4.5% గా ఉంటుందని అంచనా వేసింది.  అయితే 4.1 శాతం వరకు ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఉందని పరిస్థితి అదుపులో ఉన్నట్లు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాల ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని ప్రభుత్వం ఈ సర్వేలో పేర్కొంది. ఎకనామిక్ సర్వే 2024 రూపంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పార్లమెంటు ముందు పెట్టింది. రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో ఎకనామిక్ సర్వే అనేది అత్యంత కీలకమైనది.

Also Read: Wipro's Share Price Falls: విప్రో షేర్లు ఢమాల్...Q1లో తప్పిన అంచనాలే కారణం..!!

కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా సప్లై  అంతా కూడా చిన్న భిన్నం అయింది. అనంతరం  ఇజ్రాయిల్, గాజా సంక్షోభం వంటి సమస్యల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా సతమతం అవుతున్నాయి. అయినప్పటికీ ఆర్బీఐ సూచించిన సూచనల వల్లనే రిటైల్ ద్రవ్యోల్భణం 5.4% వద్దనే నమోదైనట్లు తెలుస్తోంది. మహమ్మారి అనంతరం నమోదైనటువంటి అత్యంత తక్కువ రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే కావడం విశేషం.

ఎకనామిక్ సర్వేలో మరో కీలక అంశం ఎల్పిజి సిలిండర్ లపై అతి తక్కువ రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లపై 200 రూపాయల వరకు ధరలు తగ్గించింది. అలాగే లీటరుకు రెండు రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ పై కూడా ధరలు తగ్గించింది. అలాగే కోర్ రంగాల్లో కూడా రిటైల్ ద్రవ్యోల్బనం అదుపులోనే ఉన్నట్లు ఎకనామిక్ సర్వే తెరిపింది. ఆహార ద్రవ్యోల్బణం గత ఏడాది 6.6% నిలవగా ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం ఇది పెరిగి 7.5% నమోదయింది. ఆహార ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం.. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడం.. అకాల వర్షాలు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణానికి  ప్రధాన కారణం టమాటా ధరలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు.  ఇదిలా ఉంటే కరోనా అనంతరం దేశ ఆర్థిక అభివృద్ధి 6.5% నుంచి 7% వరకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

Also Read : 7th Pay Commission: రేపే మోదీ 3.O బడ్జెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు..!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News