Wipro's Share Price Falls: 2024 యూనియన్ బడ్జెట్ సెషన్ కు ముందు రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత శుక్రవారం సెషన్ ఆరంభంలో భారీగా ట్రేడ్ అయి ఇప్పుడు జీవన కాల గరిష్టాలకు చేరిన ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సె్స్ చివరకు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. అదే నష్టాలను సోమవారం కూడా కొనసాగిస్తున్నాయి. ఈ వార్త రాసే సమయానికి 150 పాయింట్లకుపైగా నష్టంతో 80వేల మార్కు వద్ద ఉండగా..నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 40 పాయింట్ల పతనంతో 24వేల 500 మార్కుకు దిగువకు చేరింది. బ్యాంక్ స్టాక్స్, రియాల్టీ, FMCG,మినహాయించి మిగతా రంగాల షేర్లూ కాస్తా సానుకూలంగా ఉన్నాయి. ఆటో, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, టెలికాం షేర్లు ఒక్కోశాతం చొప్పున పెరగగా..బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం పుంజుకున్నాయి.
Also Read: DA Arrears: ఉద్యోగులకు బంప్ ఆఫర్, డీఏ బకాయిలపై బడ్జెట్ లో ప్రకటన, భారీగా ప్రయోజనం
పడిపోయిన విప్రోషేర్లు:
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో షేర్లు సోమవారం దాదాపు 9 శాతం క్షీణించాయి. పడిపోయాయి. బీఎస్ఈలో ఈ షేరు 8.79 శాతం క్షీణించి రూ. 508 కు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో 8.79 శాతం తగ్గి రూ.508 వద్ద ఉంది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో లిస్టయిన కంపెనీల్లో విప్రో షేరు భారీగా నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ లో కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 4.6 శాతం పెరిగి రూ.3,003 కోట్లకు చేరుకుందని విప్రో క్యూ1 ఫలితాల్లో వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీ ఆదాయం 2024-25 మొదటి త్రైమాసికంలో 3.8 శాతం క్షీణించి రూ.21,963.8 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ లాభం మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం భారీ తగ్గుదల కనిపించింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ.21,964 కోట్లకు చేరుకోగా, గత ఏడాది క్యూ 1 లో రూ.22,831 కోట్లుగా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన పోల్చినప్పుడు, జూన్ క్యూ 1లో విప్రో స్థూల ఆదాయం 1.1 శాతం తగ్గింది. గత క్యూ 4లో రూ.22,208 కోట్లుగా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook