Toyota: టయోటా కారుపై ఏకంగా రూ.3.50వేల భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే

Toyota Big Festive Offers : భారత్ లో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. ఈ పండగల సీజన్ లో విక్రయాలను పెంచుకునేందుకు టయోటా తన  వెహికల్స్ పై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. టయోటా తన లగ్జరీ సెడాన్ టయోటా క్యామ్రీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 

Written by - Bhoomi | Last Updated : Oct 12, 2024, 04:36 PM IST
Toyota: టయోటా కారుపై ఏకంగా రూ.3.50వేల భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే

Toyota Big Festive Offers in October 2024: దేశంలో పండుగ సీజన్ జోరుమీదుంది. కార్ మార్కెట్లో డిస్కౌంట్లు, ఆఫర్ల సందడి నెలకొంది. ఈ సారి టాప్  కంపెనీలన్నీ భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఎందుకంటే పాత స్టాక్ ఇప్పటికీ డీలర్ల వద్ద ఉండటమే కారణం.  దానిని క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి కంపెనీలు. 

ఈ తరుణంలోనే ఈ పండుగ సీజన్‌లో విక్రయాలను పెంచుకునేందుకు, టయోటా తన వాహనాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. టయోటా తన లగ్జరీ సెడాన్ టయోటా క్యామ్రీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. 

టయోటా క్యామ్రీ: 

టయోటా క్యామ్రీ పై రూ. 1.5 లక్షల డిస్కౌంట్ తోపాటు ...ఈ నెలలో టయోటా క్యామ్రీపై రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ కారుపై 50,000 రూపాయల కార్పొరేట్ తగ్గింపుతోపాటు  5 సంవత్సరాల ఫ్రీ వారెంటీ కింద రూ. 52,000ఇవ్వనుంది.మీరు ఈ కారును కొనుగోలు చేస్తే మొత్తం రూ. 3.52 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ను పొందుతారు. 

టయోటా హిలక్స్: 

ఈ పండగ సీజన్ లో  టయోటా హిలక్స్ పికప్ ట్రక్‌పై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ వాహనంపై మొత్తం రూ. 1.80 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది.  అయితే టయోటా అర్బన్ క్రూయిజర్ టాసర్‌పై రూ. 58,200 వరకు ఆదా చేసుకోవచ్చు.  దాని టర్బో వేరియంట్‌పై రూ. 86,000 వరకు ఆదా చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, Toyota Rumionపై రూ.48,000 డిస్కౌంట్ ఉంది. 

టయోటా గ్లాంజా:

ఈ నెలలో టయోటా గ్లాంజాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు దానిపై రూ. 66,700 వరకు మొత్తం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో రూ. 20,000 కస్టమర్ ఆఫర్, రూ. 20,000 లాయల్టీ/ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇది కాకుండా, రూ. 13,800 వరకు 5 సంవత్సరాల వారంటీ, రూ. 9,900 విలువైన ఫ్రీ మెయింటనెన్స్ ప్యాకేజీ పొందే అవకాశం ఉంటుంది. 

హైరైడర్ హైబ్రిడ్‌: 

 టయోటా హైరైడర్ హైబ్రిడ్ కొనుగోలుపై రూ. 86,500బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ. 23,500 విలువైన 5 సంవత్సరాల ఫ్రీ గ్యారెంటీ కూడా ఉంది. దాని S, G, V వేరియంట్‌లపై రూ. 57,000 వరకు ప్రయోజనాలు ఉంటాయి. అయితే హైరైడర్లు E వేరియంట్‌పై రూ. 32,900 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నెలలో టయోటా ఇన్నోవా క్రిస్టాపై రూ.లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది.

ఫార్చ్యూనర్‌పై భారీ డిస్కౌంట్: 

ఈ నెలలో టొయోటా ఫార్చ్యూనర్‌లో రూ. 1.30 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రూ. 30,000 కస్టమర్ తగ్గింపు.. రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌పై రూ. 75,000 క్యాష్‌బ్యాక్ తగ్గింపు  రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్  రూ. 55,000 విలువైన డియో ఎడిషన్ కిట్‌ను ఫ్రీగా పొందే ఛాన్స్ ఉంటుంది. మీరు ఫార్చ్యూనర్‌లో రూ. 2.30 లక్షల వరకు మొత్తం ప్రయోజనాన్ని పొందవచ్చు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News