Toyota Innova Hycross Mileage: అదిరిపోయే లుక్‌తో 8 సీటర్ టయోటా ఇన్నోవా హైక్రాస్, డెడ్‌ ఛీప్‌ ధరలతో పిచ్చెక్కిస్తోంది!

Toyota Innova Hycross Mileage: నూతన టెక్నాలజీతో ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల కార్లు విడుదలవుతున్నాయి. అవన్నీ ఫోర్ సీటర్ కే అంకితం కాగా.. ఇప్పుడు SUV లుక్‌తో సెవెన్ సీటర్ కార్లు కూడా మార్కెట్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి. అయితే ప్రముఖ కార్ల కంపెనీ అయినా టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్ అనే కారు విడుదల కాబోతోంది దానికి సంబంధించిన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం...

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 10:15 AM IST
Toyota Innova Hycross Mileage: అదిరిపోయే లుక్‌తో 8 సీటర్ టయోటా ఇన్నోవా హైక్రాస్, డెడ్‌ ఛీప్‌ ధరలతో పిచ్చెక్కిస్తోంది!

Toyota Innova Hycross: మార్కెట్లో  ఎస్ యు వి(SUV) కార్లకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఎంపీవి (MPV) కార్లు కూడా వాటి శైలిలో ముద్ర వేసుకున్నాయి. టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల చాలా కంపెనీలు కార్లను అత్యున్నత టెక్నాలజీ తో పాటు కొత్త కొత్త ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా SUV లుక్‌తో 7 సీట్ల MPV కార్లు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రముఖ కంపెనీ అయినా టయోటా తమ SUV ఇన్నోవా హైక్రాస్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది పెట్రోల్ వేరియంట్ లో హైబ్రిడ్ వెర్షన్ లో విడుదల చేయబోతున్నారని సమాచారం. అంతేకాకుండా టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్,  పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ల కొత్త బేస్ వేరియంట్ కూడా రాబోతోంది. ఈ ఎస్‌యువి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్‌ని ఫ్లీట్ ఆపరేటర్‌లకు బేస్, విఎక్స్, జెడ్‌ఎక్స్ అనే మూడు ట్రిమ్‌లలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ కార్లు 7,  8-సీట్ల కాన్ఫిగరేషన్ మార్కెట్లో లభించనున్నాయి. రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో ఫ్లీట్ కొనుగోలుదారులకు పెట్రోల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కార్లు మారుతి సుజుకి SUVలతో పోటీ పడనన్నాయి. అంతేకాకుండా ముందు మార్కెట్‌లో లాంఛ్ కాబోయే కార్లతో కూడా ఈ కారు పోటి పడనుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ వేరియంట్స్‌

టయోటా ఇన్నోవా హైక్రాస్ వేరియంట్స్‌:
కొత్త బేస్ వేరియంట్ టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రస్తుతం 5 ట్రిమ్స్ G, GX, VX, ZX, ZX (O) లలో లభించబోతోంది..మొదటి రెండు ట్రిమ్‌లు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇవి 7, 8-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండబోతున్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర, బుకింగ్స్

టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర, బుకింగ్స్:
ఇక ఈ SUV ధర విషయానికొస్తే..హైక్రాస్ పెట్రోల్ ఇంజన్ ధర రూ. 18.30 లక్షల నుంచి ప్రారంభమై.. హై ఎండ్ మోడల్ రూ.28.97 లక్షలల్లో మార్కెట్లో విగ్రహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హైబ్రిడ్ వేరియంట్ ధర రూ. 24.01 లక్షలతో ప్రారంభమై 28.97 లక్షల మధ్య ఉండబోతోంది. హైక్రాస్ పెట్రోల్ వేరియంట్ కారును ఇప్పుడు బుక్ చేసుకుంటే మీరు ఆరు నెలల తర్వాత డెలివరీ అవుతుంది.

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News