UIDAI New Rules: ఆధార్ కార్డును ఇప్పటి వరకూ అడ్రెస్ ప్రూఫ్‌గా, ఐడీ ప్రూఫ్‌గా, డీవోబీ ప్రూఫ్‌గా వినియోగించేవారు. అయితే యూఐడీఏఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు ఇకపై డీవోబీ ప్రూఫ్‌గా పనిచేయదు. డేటాఫ్ బర్త్ ప్రూఫ్ స్టేటస్‌లో మార్పులు అమల్లోకి వచ్చాయి.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పు విషయంలో జరుగుతున్న మోసాల్ని నియంత్రించేందుకు యూఐడీఏఐ బర్త్ సర్టిఫికేట్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. డేటాఫ్ బర్త్ వెరిఫికేషన్ విషయంలో ఆధార్ కార్డు వినియోగంలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో తరచూ మార్పులు చేస్తూ వివిధ ప్రభుత్వ పథకాల లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుండటంతో యూఐడీఏఐ ఈ మార్పులు తీసుకొచ్చింది. కొత్తగా జారీ చేసిన ఆధార్ కార్డుల్ని డేటాఫ్ బర్త్ ప్రూఫ్‌లుగా వినియోగించేందుకు వీలులేదని యూఐడీఏ తెలిపింది.
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం ఆధార్ కార్డుతో పాటు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ నిర్ధారించేందుకు బర్త్ సర్టిఫికేట్ ఒక్కటే ఇకపై కీలకమైన డాక్యుమెంట్. కొత్త నిబంధనల తరువాత ఆధార్ కార్డు ఇకపై స్కూల్, కళాశాల అడ్మిషన్లు, పాస్‌పోర్ట్ అప్లికేషన్ వంటివాటికి కీలకమైన డాక్యుమెంట్ కాగలదు. వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పధకాల లబ్ది పొందేందుకు, క్రీడల పోటీలు, పెన్షన్లు, అడ్మిషన్ల కోసం ఆధార్ కార్డులో పుట్టినతేదీని ఇష్టమొచ్చినట్టుగా మార్చుకుంటూ దుర్వినియోగం చేస్తుండటాన్ని నియంత్రించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చారు.
అయితే ఈ కొత్త నిబంధనతో బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్లు, ఇప్పటికే వివిధ పథకాల్లో ఆధార్ కార్డుతో లింక్ అయినవాళ్ల పరిస్థితేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఏ డాక్యుమెంట్ లేకుండా వయస్సు నిర్ధారించడం కష్టమౌతుంది.
Also read: Holidays List 2024: కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల, 14 కంపల్సరీ, 2 ఆప్షనల్ సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook