Toyota Innova: ప్రపంచంలోనే తొలి ఇథనాల్ ఆధారిత టొయోటా ఇన్నోవా లాంచ్

Toyota Innova: టొయోటా నుంచి సరికొత్త కారు లాంచ్ అయింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఎథనాల్‌తో నడిచే కారు ఇది. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారుని లాంచ్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2023, 10:19 AM IST
Toyota Innova: ప్రపంచంలోనే తొలి ఇథనాల్ ఆధారిత టొయోటా ఇన్నోవా లాంచ్

Toyota Innova: పరిశుభ్రత పచ్చదనం నిండిన భవిష్యత్తును అందించే దిశగా టొయోటా సరికొత్త కారును ప్రవేశపెట్టింది. దేశంలో క్లీన్ ఎనర్జీని అభివృద్ధి చేసేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడనుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని ప్రోత్సహించడం, ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని ఈ ప్రక్రియ తగ్గిస్తుంది.

దేశంలోని సుస్థిర రవాణా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది ఈ కొత్త ఆవిష్కరణ. ఎథనాల్ ఆధారిత టొయోటా ఇన్నోవా ఆవిష్కరణ అనేది భారతదేశపు ఎనర్జీ ల్యాండ్ స్కేప్‌ను మార్చనుందని అంచనా. ఇంధనంలో ఎథనాల్ కలపడం ద్వారా ఇంధనం కోసం భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ వనరుల డిమాండ్ తగ్గిస్తుంది.

ఎథనాల్ ఇంధనంతో నడిచే టొయోటా ఇన్నోవా ప్రపంచంలో బీఎస్-6 శ్రేణిలో తొలి వాహనంగా ఖ్యాతికెక్కింది. ఇదొక ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్. ప్రత్యామ్నాయ ఇంథనాలతో నడిచే వాహనాల్ని అభివృద్ధి చేసేందుకు కర్బన ఉద్గారాల్ని తగ్గించే దిశగా కార్ల తయారీదార్లను ప్రోత్సహించేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంతకుముందు టొయోటా కంపెనీకే చేందిన టొయోటా మిరాయ్ ఈవీని లాంచ్ చేశారు. ఇప్పుడు ఎథనాల్ ఆధారిత కారు లాంచ్ చేశారు.

ఇథనాల్‌తో నడిచే టొయోటా ఇన్నోవా హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంటుంది. 40 శాతం ఇథనాల్ తో, 60 శాతం ఎలక్ట్రిక్ ఎనర్జీతో నడుస్తుంది. ఈ అద్భుతమైన మిశ్రమ ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంతో కాలుష్యం తగ్గుతుంది. ఈ హైబ్రిడ్ ఇంజన్ తో మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా 20 శాతం కంటే ఎక్కువగా ఇథనాల్ ఉపయోగపడేందుకు వీలవుతుంది. 

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇథనాల్ ఆధారిత టొయోటా ఇన్నోవా. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పర్యావరణానికి మేలు చేకూర్చడం, భవిష్యత్తులో క్లీన్ ఎకోను అభివృద్ధి చేయడం ఈ తరహా వాహనాలతో సాధ్యమౌతుంది.

Also read: UPI New Feature: యూపీఐ కొత్త పీచర్ చూశారా, వాయిస్ కమాండ్‌తో క్షణాల్లో పేమెంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News