VinFast VF3 New Model EV Car 2024: భారత మార్కెట్లోకి త్వరలోనే కొత్త కార్ల కంపెనీ అడుగుపెట్టబోతోంది. ప్రముఖ వియత్నాం విన్‌ఫాస్ట్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు వీఎఫ్3 పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇటీవలే సోషల్ మీడియాలో కంపెనీ వెల్లడించింది. ఈ కారు కంపెనీ ఇప్పటికే తమ దేశంలో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఈ కారుకు సంబంధించిన ప్రిబుకింగ్ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే 27,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్లు వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు భారత మార్కెట్లోకి విడుదలైతే టాటాతో పాటు వివిధ కంపెనీల మైక్రో SUVలతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ VinFast కంపెనీ VF3 ఎలక్ట్రిక్ కారును ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. కంపెనీ VF6, VF7, VF8తో పాటు VF9 వంటి మోడల్స్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ కార్లు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 3.2 మీటర్ల కంటే తక్కువ పొడవుతో అందుబాటులోకి రానుంది. ఈ కారు అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
WinFast VF3 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ఈ కారు దీని పొడవు 3190 మిమీ, వెడల్పు 1679 మిమీ కొలతలతో అందుబాటులోకి రాబోతోంది. ఇది 550 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు LED టెయిల్ ల్యాంప్స్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే మృదువైన క్లోజ్-అప్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్స్‌తో వస్తోంది. దీనికి క్రోమ్-ఫినిష్డ్ లోగో కూడా ఉంటుంది. ఈ కారులో 5 మంది ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా ప్రయణించే సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే యూనిట్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇది Android Autoతో పాటు Apple CarPlay సపోర్ట్ చేసే 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ సెటప్‌లతో లభించబోతంది. ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 201కిలోమీటర్ల రేంజ్ వరకు మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు MG కామెట్ ఉన్న అన్ని ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ కారు ధర వివరాల్లోకి, దీని ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి