Vodafone Idea Latest Offers: Vi అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే..!

Vi Recharge Offers Today: ఎక్కువగా డేటాను వినియోగించుకునే Vi కస్టమర్లకు సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ పరిచయం చేసింది. డైలీ డేటాతోపాటు 5జీబీ డేటాను కూడా బోనస్‌గా అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 06:48 PM IST
Vodafone Idea Latest Offers: Vi అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే..!

Vi Recharge Offers Today: ప్రస్తుతం టెలికామ్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌ల వైపు వెళ్లకుండా ఆకర్షణీయమైన ప్లాన్‌లతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో Vodafone Idea (Vi) కూడా సూపర్‌ ఆఫర్లతో కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. Vi నుంచి 1.5 జీబీ రోజువారీ డేటాతో పాటు బోనస్ డేటాతో వచ్చే స్వల్పకాలికంగా చెల్లుబాటు అయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌తోపాటు అదనపు డేటాను వినియోగించుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది.  

రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఇలా..
 
ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త రూ.299 ప్లాన్‌ను ప్రారంభించింది Vodafone Idea. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ రోజువారీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో 5 జీబీ బోనస్ డేటాను లభిస్తుంది. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో ఉంటుంది. వీకెండ్ డేటా రోల్‌ఓవర్, బింగే ఆల్ నైట్, డేటా డిలైట్స్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. అన్ని ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులు తక్కువ ధరలో ఈ ప్లాన్‌ సరైన ఎంపికగా చెప్పొచ్చు.

అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్‌లో 42 జీబీతో డేటాతో 5 జీబీ బోనస్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో Vi Movies, టీవీ క్లాసిక్ ఓటీటీ ప్రయోజనం కూడా లభిస్తుంది. Vi యాప్ ద్వారా వినియోగదారులు iOS, ఆండ్రాయిడ్‌లో ఓటీటీ కంటెంట్‌ని వీక్షించవచ్చు. బింగే ఆల్‌ నైట్ ఆఫర్‌తో అన్‌లిమిటెడ్ డేటా ప్రయోజనం పొందొచ్చు. నైట్ టైమ్‌లో ఎక్కువ డేటాను యూజ్ చేసుకునేవారికి వారికి ఇది మంచి ఆఫర్‌గా ఉంటుంది. అదనంగా లభించే 5 జీబీ డేటా మొదటి 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ డేటా అయిపోతుంది.

Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News