IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!

 Sensex:స్టాక్ మార్కెట్ లోని BSE SME సూచీలో నేడు వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు బంపర్ లిస్టింగ్ అందుకున్నాయి.షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసింది. దాదాపు ఈ షేర్లు లిస్ట్ అయిన అనంతరం 100 శాతం వరకు రిటర్న్ అందించాయి. అంటే రూ.1 లక్షకు రెండు లక్షల వరకు లాభం వచ్చింది.

Written by - Bhoomi | Last Updated : Jul 30, 2024, 03:44 PM IST
IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!

VVIP Infratech: స్టాక్ మార్కెట్లో  ప్రైమరీ మార్కెట్లో సందడి నెలకొని ఉంది. వరుసగా ఇటీవల లిస్ట్ అయినటువంటి ఐపివోలు ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. తాజాగా నేడు మంగళవారం జూలై 30వ తేదీ  వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు  స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ షేర్లు నేడు BSE SME సూచిలో దాదాపు 90% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అంటే  దాదాపు  ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి 1.90 లక్షల రూపాయల లాభం వచ్చింది. IPO బిడ్డింగ్ ధర రూ. 93కు గానూ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కో షేరుకు రూ.176 వద్ద లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ అయిన ఒక నిమిషంలోనే కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో ఈ షేరు రూ.185కి చేరుకుంది. అంటే ఇన్వెస్టర్లు తొలిరోజే డబుల్ లాభాలను అందుకున్నారు. 

Also Read :NEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచే

ఇక ఐపిఓ మార్కెట్ విషయానికి వస్తే  వివిఐపి ఇన్ఫ్రాటెక్ షేర్లు  జూలై 23 నుంచి ఐపీవో కోసం బిడ్లను ఆహ్వానించాయి. జూలై 25న బిడ్డింగ్ ముగిసింది. IPO కోసం ప్రైజ్ బ్యాండ్ కింద ఒక్కో షేరుకు రూ. 91- 93 మధ్య ధరను నిర్ణయించారు. ఈ ఇష్యూ కోసం కనీసం 1,200 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్ కోసం కనీసం రూ. 111600 కేటాయించాల్సి ఉంటుంది. VVIP ఇన్‌ఫ్రాటెక్ IPO ద్వారా సుమారు రూ. 61.21 కోట్ల నిధుల సేకరణ జరిపారు. మొత్తం 6,582,000 ఈక్విటీ షేర్లకు గానూ బిడ్లను ఆహ్వానించారు. 

VVIP ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ వ్యాపారం ప్రధానంగా  నీటి ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, సెక్టార్ డెవలప్‌మెంట్, జల్ జీవన్ మిషన్ పనులు, విద్యుత్ పంపిణీ, 33 కెవిఎ వరకు సబ్‌స్టేషన్ల నిర్మాణం ప్రధానంగా ఉన్నాయి. కంపెనీ ప్రమోటర్లుగా వైభవ్ త్యాగి, విభోర్ త్యాగి, ప్రవీణ్ త్యాగి ఉన్నారు. అలాగే ఈ ఐపీవోకు షేర్ ఇండియా క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే  బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉన్నారు.

Also Read :​ Poco C65 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ POCO C65 మొబైల్‌ రూ.2,599కే.. డిస్కౌంట్‌ వివరాలు ఇవే!  

ఇదిలా ఉంటే తాజాగా ఐపివో మార్కెట్లో  వరుసగా  లిస్టింగ్ లోకి  వస్తున్న కంపెనీలు మంచి ఎంట్రీని ఇస్తున్నాయి. కాగా ఆగస్టు నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ రూపంలో  మరో భారీ ఐపీఓ మార్కెట్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రైమరీ మార్కెట్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు  ఇన్వెస్టర్లు సిద్ధమవుతున్నారు.

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News