Scooty Price: 70 వేలల్లో స్కూటీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

Scooty Price: 70 వేలలోపు ఓ మంచి స్కూటీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..  ఇందుకోసం హోండా, సుజుకీ, టీవీఎస్‌ కంపెనీల నుంచి వచ్చిన పలు రకాల మోడళ్లను ఒక్కసారి పరిశీలించండి. ఈ తరహా స్కూటీల్లో అధునాతన ఫీచర్లు కల్పించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 12:53 PM IST
  • ఇండియాలో స్కూటీలకు తగ్గని డిమాండ్‌
  • మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో స్కూటీలు
  • రూ. 70వేలలోపు స్కూటీలు కొనుగోలు చేసే అవకాశం
Scooty Price: 70 వేలల్లో స్కూటీ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

Scooty Price: మధ్య తరగతి వ్యక్తికి ద్విచక్రవాహనమే ఓ కారు. ఎక్కడికి వెళ్లాలనుకున్నా అతడి రవాణా సదుపాయం టూవీలరే. కారు కొనుగోలు చేసే స్థోమత లేని కుటుంబాలు ఇప్పటికీ ద్విచక్రవాహనాలపైనే ప్రయాణం చేస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ఇండియాలో  స్కూటీల ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఆడవారికి కోసమే అన్నట్టుగా స్కూటీల డిజైన్‌  లు వచ్చేవి. రానురాను స్కూటీల వినియోగం భారీగా పెరిగింది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసమే స్కూటీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ లో గేర్‌ మార్చడం లాంటి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో మహిళలతో పాటు పురుషులు కూడా ఈ స్కూటీలను కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. అందుకుతగ్గట్టుగా కంపెనీలు కూడా స్కూటీల డిజైన్ లు, ఫీచర్లలోనూ భారీ మార్పులు చేస్తోంది. అలా తాజాగా మార్కెట్‌ లోకి వచ్చిన 70 వేల లోపు వచ్చే స్కూటీలను ఒక్కసారి చూద్దాం..!

హోండా డియో (Honda Dio):
హోండా డియో స్కూటీ డిజైన్‌ పరంగా అద్భుతంగా ఉంటుంది. ముందు, వెనకాల ఉన్న లైట్‌ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 110 సీసీ కలిగిన ఈ స్కూటీ ఎక్స్‌ షోరూం ధర 52 వేల 241 రూపాయలుగా ఉంది.

టీవీఎస్‌ జుపిటర్‌ (Tvs jupiter):
టీవీఎస్‌ జుపిటర్‌.. 110 సీసీగల స్కూటీల్లో ఇది ఎంత ఫేమస్‌ చెప్పలేం. భారత్‌ ఈ స్కూటీకి మంచి డిమాండే ఉంది. ఈ స్కూటీని మెటల్‌ బాడీతో డిజైన్‌ చేయడంతో పాటు ట్యూబ్‌ లెస్‌ టైర్లు కూడా ఇచ్చారు. 17 లీటర్ల సీట్‌ స్టోరేజీ సదుపాయం ఉంది. ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఆప్షనల్‌ కింద తీసుకోవచ్చు. ఒకలీటర్‌ కు 62 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర(ఎక్స్‌షోరూం) 55 వేల 349 రూపాయలు.

సుజుకీ యాక్సెస్‌( Suzuki Access 125):
సుజుకీ యాక్సెస్‌ 125 సీసీ స్కూటీ అమ్మకాలు కూడా ఈ మధ్య కాలంలో క్రమంగా పుంజుకుంటున్నాయి. అనేక ఫీచర్లతో ఈ స్కూటీని అధునాతనంగా తీర్చిదిద్దారు. ఈ స్కూటీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 160 మీ.మీటర్లుగా ఇచ్చారు. దీని ప్రారంభ ధర(ఎక్స్‌షోరూం) 59 వేల 014 రూపాయలు.

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ (TVS NTORQ 125):
అనేక ఫీచర్లతో టీవీఎస్‌ ఎన్‌టార్క్‌  స్కూటీని మార్కెట్‌ లోకి తీసుకువచ్చింది కంపెనీ. ఈ స్కూటీకి  ట్యూబ్‌ లెస్‌ టైర్లతో పాటు టాప్‌ స్పీడ్‌ రికార్డర్‌ ఆప్షన్‌ ఇచ్చారు. సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ తో వచ్చిన ఈ స్కూటీలో అలయ్‌ వీల్స్‌ తో పాటు మరెన్నో అధునాతన సదుపాయాలు కల్పించారు. దీని ఎక్స్‌ షోరూం ధర59 వేల 462 రూపాయలుగా ఉంది.

హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G):
హోండా యాక్టివా స్కూటీలకు ఇండియా ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాక్టివా ఇప్పుడు ఆరో జనరేషన్‌ స్కూటీలు మార్కెట్లోకి వచ్చాయి. ఆరో జనరేషన్‌ స్కూటీలో కంపెనీ సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. డిజైన్‌ ను అప్‌ డేట్‌ చేయడంతో పాటు సీటింగ్‌ స్పేస్‌ మరింత ఎక్కువగా వచ్చేలా చేశారు. 110 సీసీ,సింగిల్‌ సిలిండర్ ఇంజిన్‌ తో ఈ స్కూటీ వస్తుంది. దీని ప్రారంభ ధర (ఎక్స్‌ షోరూం) 63 వేల 912 రూపాయలు గా ఉంది.

Also Read: Jeevan Reddy Fire: బండి సంజయ్‌ బెస్ట్‌ కమెడియన్‌.. అమిత్‌ షా బెస్ట్‌ విలన్‌ అంటున్న జీవన్‌ రెడ్డి

Also Read: Eclipse & Pournami 2022: ఒకేరోజు చంద్రగ్రహణం, పౌర్ణమి.. అరుదైన ఘట్టం.. 80 ఏళ్ల తర్వాత గ్రహాలు, నక్షత్రాల కలయిక.. ఈ రాశులపై ప్రభావం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News