Whatsapp Alerts: పదే పదే గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లు పంపిస్తున్నారా..మీ ఎక్కౌంట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

Whatsapp Alerts: వాట్సప్ లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమేనేమో. ఉదయం లేచిన వెంటనే గుడ్ మార్మింగ్ మెస్సేజ్‌లు పంపించకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం అప్రమత్తత అవసరం. లేకపోతే మీ ఎక్కౌంట్ క్లోజ్ కావచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 19, 2022, 06:49 PM IST
Whatsapp Alerts: పదే పదే గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లు పంపిస్తున్నారా..మీ ఎక్కౌంట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ వినియోగం రోజురోజుకూ అధికమౌతోంది. అయితే వాట్సప్ మెస్సేజ్‌‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇకపై. లేకుంటే మీ వాట్సప్ ఎక్కౌంట్ బ్లాక్ కాగలదు. తస్మాత్ జాగ్రత్త.

వాట్సప్ మెస్సేజింగ్ యాప్ దినచర్యలో ఓ భాగంగా మారిపోయింది అందరికీ. మెస్సేజ్, చాటింగ్ ఇలా, వీడియో కాల్ ఇలా ప్రతి ఒక్కటీ వాట్సప్‌తోనే. రోజూ లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లు పంపించకపోతే ఏమీ తోచని పరిస్థితి. వాట్సప్‌లో ఎక్కువ మెస్సేజ్‌లు పంపిస్తుంటే ఆ అలవాటు తక్షణం మానుకోండి. లేకపోతే మీ వాట్సప్ ఎక్కౌంట్ బ్లాక్ అవుతుంది. గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లు అధికంగా పంపిస్తే మీ ఎక్కౌంట్ శాశ్వతంగా బ్లాక్ అవుతుంది.

ఒకే విధమైన మెస్సేజ్ అదే పనిగా అందరికీ ఫార్వర్డ్ చేస్తుంటే మీ ఎక్కౌంట్ రద్దయ్యే ప్రమాదముంది. వాస్తవానికి కంపెనీ ఇలా చేస్తే స్పామ్‌గా పరిగణిస్తుంది. మీ వాట్సప్ ఎక్కౌంట్ రద్దు చేస్తుంది. కేవంల గుడ్ మార్నింగ్ మెస్సేజ్‌లే కాకుండా ఇతర మెస్సేజ్‌లు కూడా పదే పదే ఫార్వర్డ్ చేస్తుంటే ఎక్కౌంట్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంది.

ఎక్కువ కాంటాక్ట్స్‌కు ఫార్వర్డ్ చేసినా మీ ఎక్కౌంట్ బ్లాక్ అవుతుంది. అందుకే ఒకే తరహా మెస్సేజ్‌లు పదే పదే ఫార్వర్డ్ చేయడం మానుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. 

Also read: Multibagger Shares: దీపావళికి ముందే..ఊహించని లాభాలిచ్చిన మూడు కంపెనీల షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News