Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!

Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయంగా మార్కెట్ల పతకానికి దారి తీసిన కారణాలను ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ భామ్రే వివరించారు. అవేంటో చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Aug 5, 2024, 06:45 PM IST
Stock Market Crash Today :  స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!

Stock market crash today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో ఉదయం నుంచి కొనసాగుతున్న నష్టాల పరంపర దేశీయ మార్కెట్లను తాకింది. సెన్సెక్స్ ఇంట్రాడెల్ లో దాదాపు 2500 పాయింట్ల వరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఒక దశలో నిఫ్టీ సైతం 24000వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ క్యాప్ దాదాపు 15లక్షల కోట్లు పడిపోయింది. ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్ల సంపద రూ.17.11 లక్షల కోట్లు తగ్గి రూ.4,40,04,979.86 కోట్లకు చేరుకుంది. ఆసియా మార్కెట్లలో భారీ క్షీణత కారణంగా, భారతీయ స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ 2,686.09 పాయింట్లు లేదా 3.31 శాతం పడిపోయి 78,295.86 వద్ద కొనసాగింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 824 పాయింట్లు లేదా 3.33 శాతం తగ్గి 23,893.70 వద్దకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమైన ట్రిగ్గర్ పాయింట్లును వివరించారు ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు అసిత్ సి మెహతా ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్మీడియట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ భామ్రే. 

Also Read: EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‎లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!

ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా అడుగులు:

ఇటీవల అమెరికా విడుదల చేసిన జాబ్స్ డేటా అంచనాల కంటే చాలా తక్కువగా నమోదు అయ్యింది. జాబ్స్ డేటా ప్రకారం నిరుద్యోగిత రేటు 4.1శాతం అంచనా వేయగా, అందుకు బదులుగా 4.3 శాతానికి ఇది  పెరిగింది. దీంతో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ నియంత్రణకు వడ్డీ రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ప్రముఖ ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున జాబ్స్ కటింగ్ చేస్తుండటంతో పాటు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ కూడా పడిపోతున్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పతనం అవుతున్నాయి. జనాభా వృద్ధికి తగినంతగా ఉద్యోగాలు పెరగకపోవడం కూడా మాంద్యం భయాలను పెంచుతోంది. అమెరికాలో చివరి సారిగా 2007 సంవత్సరంలో ఎకనామిక్ రిసెషన్ ఏర్పడింది. 

అంచనాలు తప్పిన అమెరికా కార్పోరేట్ కంపెనీ లాభాలు:

అమెరికాలోని కార్బోరేట్ కంపెనీలు ఇటీవల విడుదల చేసిన క్వార్టర్ ఫలితాల్లో వాటి లాభదాయకతను కోల్పోయినట్లు సూచించాయి. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీల్లో ఈ క్షీణత నమోదు అయ్యింది. ముఖ్యంగా అమెజాన్, యాపిల్ వంటి కంపెనీలు సైతం నష్టాలను నమోదు చేస్తున్నాయి. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ యాపిల్ సంస్థలో తన వాటాలను 50 శాతం మేర తగ్గించుకున్నారు

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత:

అలాగే గ్లోబల్ మార్కెట్లలో కరెక్షన్ కు ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ప్రతిష్టంబను కూడా ఒక కారణంగా చెబుతున్నారు ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం వల్ల ఆయిల్ ఉత్పత్తి పైన దీని ప్రభావం పడుతుంది గల్ఫ్ దేశాల ఆయిల్ మార్కెటింగ్ రవాణా పైన కూడా దీని ప్రభావం పడితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి

హయ్యర్ వేల్యూయేషన్స్ వల్ల కరెక్షన్ : 

మరోవైపు భారత స్టాక్ మార్కెట్ లో కూడా ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి ఈ స్థాయి నుంచి కరెక్షన్ అనేది అనివార్యం అవుతోంది ఇప్పటికే ఎలక్షన్ రిజల్ట్స్ సమయంలో తాత్కాలిక కరెక్షన్ మార్కెట్లకు వచ్చినప్పటికీ పెరిగిపోయిన వాల్యుయేషన్స్ నేపథ్యంలో మరో భారీ కరెక్షన్ అనివార్యం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు

ఐటీ షేర్ల పతనంతో మార్కెట్ పై నెగిటివ్ ప్రభావం : 

ఐటీ కంపెనీలు ఎక్కువగా అమెరికా ఇతర పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే ఆధారపడి ఉంటాయి, అమెరికా ఆర్థిక మాంద్యం నేరుగా మన దేశం నుంచి పనిచేస్తున్న ఐటీ కంపెనీలపైన స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టిసిఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్లపై ఆధారపడి పనిచేస్తాయి. అంతేకాదు ఈ కంపెనీలు మన స్టాక్ మార్కెట్లో కూడా ప్రధాన సూచీల్లో మార్కెట్ పరంగా హెవీ వెయిట్ స్టాక్స్ గా ఉన్నాయి. ఈ స్టాక్స్ పతనం కూడా షేర్ మార్కెట్ పతనానికి కారణం అవుతున్నాయి.

Also Read: Business Ideas: ఉదయం 2 గంటలు పనిచేస్తే చాలు నెలకు రూ. 50 వేలు పక్కాగా సంపాదించవచ్చు.! 

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News