Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!

Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు తక్కువ నిడివిలోనే ఎక్కువ సంపాదన ఆశిస్తున్నట్లయితే మోతిలాల్ ఓస్వాల్ సూచించిన ఐదు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు సుమారు 38% వరకు రాబడి లభించే అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రముఖ బ్రోకర్ అనే సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అందించినవే కావడం గమనార్హం.   

Written by - Bhoomi | Last Updated : Jul 26, 2024, 10:37 AM IST
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!

Stocks To Buy: బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్లలో  ఆశించిన స్థాయిలో కదలిక లభించలేదు. కానీ శుక్రవారం మాత్రం స్టాక్ మార్కెట్ సుమారు 500 పాయింట్లు లాభపడింది. బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు తక్కువ నిడివిలోనే ఎక్కువ సంపాదన ఆశిస్తున్నట్లయితే మోతిలాల్ ఓస్వాల్ సూచించిన ఐదు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు సుమారు 38% వరకు రాబడి లభించే అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రముఖ బ్రోకర్ అనే సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అందించినవే కావడం గమనార్హం. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ పరంగాను, టెక్నికల్ పరంగాను బలంగా ఉన్నాయి. అలాంటి ఐదు రకాల స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వీటి టార్గెట్ ఎంత శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా చూద్దాం. 

Larsen and Toubro:  

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ మౌలిక రంగంలో భారీ పెట్టుబడులతో  అనేక కొత్త ప్రాజెక్టులను చేపడుతోంది.  ప్రస్తుతం బడ్జెట్లో మౌలిక రంగ నిర్మాణ రంగానికి  కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో  ఈ స్టాక్ ఒక్కసారిగా  అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  తాజాగా ఈ స్టాకు సంబంధించి మోతీలాల్ ఓస్వాల్ కు చెందిన బ్రోకరేజ్ సంస్థ ఒక్కో షేరు షేరు టార్గెట్ రూ.4,150గా ఉంచారు. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ. 3622 వద్ద ఉంది.  స్టాక్ ప్రస్తుత ధర నుండి 15 శాతం లాభం పొందే అవకాశం చూపుతుంది. 

SBI Life Insurance:

మోతీలాల్ ఓస్వాల్ బ్రోకేరేజ్ సంస్థ తన రాడార్ లో SBI లైఫ్ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయమని సలహా ఇచ్చింది. ఒక్కో షేరు టార్గెట్ రూ.1900గా నిర్ణయించింది. జూలై 25, 2024న షేర్ రూ.1692. ఈ విధంగా, స్టాక్ ప్రస్తుత ధర నుండి 12 శాతం పైకి చూపుతుంది. 

Jindal Steel & Power:

 బడ్జెట్ అనంతరం స్టీల్ రంగానికి చెందినటువంటి షేర్లు భారీగా పెరుగుతున్నాయి.  ఈ రంగంలో జిందాల్ స్టీల్ కు మంచి పేరుంది. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకేరేజ్ సంస్థ  జిందాల్ స్టీల్, పవర్‌ షేరుపై బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించింది. ఈ  షేరు టార్గెట్ రూ.1200గా ఉంచారు. ప్రస్తుతం ఈ షేర్ రూ.942గా నిర్ణయించారు.  స్టాక్ ప్రస్తుత ధర నుండి 27 శాతం అప్ సైడ్ చూపుతుంది. 

Federal Bank:

మోతీలాల్ ఓస్వాల్ బ్రోకేరేజ్ సంస్థ ఫెడరల్ బ్యాంక్‌ షేర్లపై కొనుగోలు చేయమని  సలహా ఇచ్చింది.ఈ  షేరు టార్గెట్ రూ.230గా నిర్ణయించారు. నేడు ఈ షేర్ రూ. 204 వద్ద ఉంది. ఈ స్టాక్ ప్రస్తుత ధర నుండి 12 శాతం అప్ సైడ్ చూపుతోంది.

DCB Bank:

మోతీలాల్ ఓస్వాల్ బ్రోకేరేజ్ సంస్థ DCB బ్యాంక్‌పై బయ్యింగ్ సలహా ఇచ్చింది. ఒక్కో షేరు టార్గెట్ రూ.175 వద్ద ఉంచారు. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.127. ఈ విధంగా, స్టాక్ ప్రస్తుత ధర నుండి 38 శాతం పైకి చూపుతుంది.

Also read: Jio Bharat J1: యూపీఐ చెల్లింపులు, లైవ్ టీవీ స్ట్రీమింగ్ తో జియో నుంచి కొత్త ఫోన్, ధర చాలా చాలా తక్కువ

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News