Work From Home Jobs: జాబ్స్ కోసం చూస్తున్నారా... ఫ్లిప్‌కార్ట్‌లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' జాబ్స్...

Work From Home Jobs in Flipkart: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి అప్లికేషన్స్ కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 8, 2022, 10:37 AM IST
  • ఫ్లిప్‌కార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
  • వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్న ఫ్లిప్‌కార్ట్
  • హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఖాళీలు
Work From Home Jobs: జాబ్స్ కోసం చూస్తున్నారా... ఫ్లిప్‌కార్ట్‌లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' జాబ్స్...

Work From Home Jobs in Flipkart: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) జాబ్స్ కూడా ఉన్నాయి. ఇంటి నుంచే పనిచేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. అలాగే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. 

'ఉత్తమ వ్యక్తులు ఉత్తమ టీమ్స్‌ను ఏర్పరచగలరు. అందుకే మా టీమ్స్‌కి సరైన వ్యక్తులను ఎంపిక చేయడం కోసం మేము చాలా కృషి చేస్తాం. ఫ్లిప్‌కార్ట్‌లో అందరి ఆలోచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది. కస్టమర్ ఫస్ట్ అనే కాన్సెప్ట్‌తో మేము పనిచేస్తాం. నాణ్యత, సమగ్రత వంటి విలువలకు కట్టుబడి ఉంటాం. టాలెంట్ అట్రాక్షన్, టాలెంట్ డెవలప్‌మెంట్ అండ్ రిటెన్షన్, కల్చర్ అండ్ పాలసీపై మా ఫోకస్ ఉంటుంది.' అని తాజా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. కాగా, వాల్‌మార్ట్‌కి చెందిన గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్ ఒక భాగం. ఇందులో ఫ్లిప్‌కార్ట్ హోల్ సేల్, మైంత్రా, క్లియర్ ట్రిప్ వంటి సంస్థలున్నాయి. ఈ గ్రూప్‌కు డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పేలోనూ భారీ వాటా ఉంది.

Also Read: Horoscope Today September 8th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారు ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి..  

Also Read: Apple iphone 14: యాపిల్ నుంచి లాంచ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ప్రో మోడల్స్.. ధరలు, ఫీచర్స్ ఇవే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News