Zerodha CEO Nithin Kamath Shares his Father In Law Life Style: జీవితంలో డబ్బు ఉంటే చాలు.. ఏదైనా సొంతం చేసుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. మరికొందరు జీవితంలో డబ్బే సర్వస్వం కాదని నమ్ముతున్నారు. డబ్బు ఇవ్వలేని సంతోషాలు జీవతంలో చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ కోవలోకే వస్తారు ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ మామయ్య శివాజీ పాటిల్. అల్లుడు కోట్లకు అధిపతి అయినా.. ఆయన మాత్రం సాధాసీదా జీవితం గడుపుతున్నారు. లగ్జరీ, సంపద, కీర్తి అన్నింటికి దూరంగా చిన్న కిరాణ కొట్టు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని బెల్గామ్‌లో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న శివాజీ పాటిల్.. తన కూతురు కోటీశ్వరాలు అయినా.. అల్లుడు సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా.. ఆ గర్వం కొంచెం కూడా చూపించరు. తనకు పిల్లనిచ్చిన మామ గురించి గొప్పగా చెబుతూ.. నితిన్ కామత్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నితిన్ కామత్ మామ శివాజీ పాటిల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. కార్గిల్ యుద్ధంలో పోరాడి.. రెండు వేళ్లు పోగొట్టుకుని రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆర్మీ నుంచి రిటైరయ్యాక ఆయన స్వగ్రామంలో చిన్న కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కానీ ఈ రోజు కూడా తన పనిలో బిజీగా ఉన్నారు. ఈ కిరాణా దుకాణం నుంచి వచ్చే ఆదాయంతోనే ఆయన జీవనాన్ని సాగిస్తున్నారు. దుకాణానికి సరుకులు తీసుకురావడానికి అతని వద్ద సాధారణ స్కూటర్ ఉంది. రోజంతా దుకాణంలోనే గడుపుతూ.. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
తన మామ గురించి నితిన్ కామత్ చెబుతూ.. 70 ఏళ్ల వయసులో కూడా శివాజీ పాటిల్ షాపు వద్ద గంటల తరబడి నిలబడి సరుకులు అమ్ముతున్నారని తెలిపారు. దుకాణం, ఇంటి నిర్వహణలో కూడా ఎవరి సాయం తీసుకోరని చెప్పారు. వ్యాపారంలో వచ్చే కొద్దిపాటి లాభాలతోనే ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారని.. జీవితానికి అసలు అర్థాన్ని తనకు నేర్పించారంటూ ట్వీట్ చేశారు. నిజమైన స్వాతంత్య్రాన్ని సాధించాలంటే సంతృప్తిగా ఉండటమే.. అందుకు శివాజీ పాటిల్ ఉత్తమ ఉదాహరణ రాసుకొచ్చారు. 20 ఏళ్లకు పైగా ఆయన కిరాణం కొట్టు నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను, సీమా (నితిన్ భార్య) కెరీర్లో ఎంతో సక్సెస్ అయినా.. ఆయన మాత్రం కిరణా కొట్టు వ్యాపారాన్ని వీడడం లేదన్నారు.
2007లో తన కూతురి పెళ్లికి అనుమతి వెళ్లినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని తనకు సూచించారని గుర్తు చేసుకున్నారు నితిన్ కామత్. తనలోని టాలెంట్ గుర్తించి సీమతో పెళ్లికి ఒప్పుకున్నారని తెలిపారు. జీవితంలో సంతోషంగా ఉండాలని నేర్పించారని చెప్పారు. 2010లో తన సోదరుడు నిఖిల్ కామత్‌తో కలిసి జెరోధా సంస్థను నెలకొల్పారు. ఈ కంపెనీ అంచలంచెలుగా ఎదిగి.. దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థలలో జెరోధా ఒకటిగా ఎదిగింది.
Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: Tatkal Ticket Rules: తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్టులో ఉంటే డబ్బులు వస్తాయా..? పూర్తి వివరాలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి