Chhattisgarh Crime: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. గురువును హత్య చేసి రక్తం తాగిన శిష్యుడు

Chhattisgarh Murder Case: గురువు వద్ద తంత్ర విద్యలు నేర్చుకుంటున్నాడు. ఎవరో చెప్పిన మాటలు విని గురువును మించిన శిష్యుడు కావాలని అనుకున్నాడు. చివరకు విద్య నేర్పించిన గురువునే హత్య చేశాడు. అంతేకాదు అతని రక్తం తాగి.. ప్రైవేట్ భాగాల్లో కర్ర పెట్టి దహనం చేశాడు. పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 03:07 PM IST
  • ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన
  • గురువును హత్య చేసిన శిష్యుడు
  • తలపై కర్రతో బాది.. రక్తం తాగి..
Chhattisgarh Crime: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. గురువును హత్య చేసి రక్తం తాగిన శిష్యుడు

Chhattisgarh Murder Case: ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఓ శిష్యుడు తన గురువును హత్య చేసిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. శిష్యుడు తంత్ర-మంత్ర విద్యలో ప్రావీణ్యం పొందాలనుకుని.. గురువు తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. అనంతరం గురువు రక్తం తాగాడు. అనంతరం గురువు ప్రైవేట్‌ భాగంలో కర్ర పెట్టి సజీవ దహనం చేశాడు. ధామ్‌తరి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

ప్యారీ సోడూర్ నది ఆనికట్ ఒడ్డున శంసన్ ఘాట్ సమీపంలో ఒక వ్యక్తి సగంకాలిన మృతదేహం పడి ఉందని ధామ్‌తరి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టగా.. తన తండ్రి జనవరి రాత్రి 8 గంటల సమయంలో రౌనక్‌సింగ్‌ ఛబ్రా అనే వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడని మార్కెట్‌ నయాపారా పోలీస్‌ స్టేషన్‌లో దేవేంద్ర సాహు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తేలింది. చికిత్స కోసం బయటకు వెళ్లిన వారు ఉదయం వరకు ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్యారీ నది ఒడ్డున సగం కాలిపోయిన మృతదేహం గురించి ఫిర్యాదుదారుకు చెప్పగా.. అతను సంఘటనా స్థలానికి వచ్చి మృతుడు తన తండ్రిగా గుర్తించాడు. 

పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ధామ్‌తరీ ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుడు చివరిసారిగా గోబ్రా నయాపరా మహానది వంతెనపై నుంచి రౌనక్ సింగ్ ఛబ్రాతో కలిసి తన మోటార్‌సైకిల్‌పై లోమాష్ రిషి ఆశ్రమం వైపు వెళ్తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు రౌనక్ సింగ్ ఛబ్రా చిరునామాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రా హత్యను అంగీకరించాడు. 

మృతుడు బసంత్ సాహుకు భూతవైద్యం ఎలా చేయాలో తెలుసునని.. నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రా తంత్ర మంత్రాన్ని గురువు దగ్గర నేర్చుకుంటున్నాడని ధామ్‌తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. మృతుడు బసంత్ సాహు, నిందితుడి మధ్య గురు-శిష్య సంబంధం ఉందన్నారు. 'జనవరి 31వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ తంత్ర సాధన కోసం శ్మశాన వాటిక వద్దకు వచ్చారు. తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని చంపి.. అతని రక్తాన్ని సజీవంగా తాగితే తంత్ర సాధక్‌కు అద్భుతమైన శక్తులు లభిస్తాయని నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రాతో ఒక సాధు చెప్పాడు. 

ఈ క్రమంలో తంత్ర సాధనలో నిమగ్నమైన తన గురువు బసంత్ సాహును తలపై రౌనక్ సింగ్ కర్రతో కొట్టాడు. తన నుంచి రక్తం కారుతుండగా తాగేశాడు. బసంత్ సాహు చనిపోయిన తరువాత అతని జననాంగాలలో కర్ర పెట్టి కాల్చాడు. నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రాపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఒళ్లు గగుర్పుడిచే ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేకిత్తిస్తోంది. 

Also Read: Delhi Crime: ఎలా వస్తాయి రా బాబు ఐడియాలు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆకట్టుకునేందుకు మైనర్లు ఏం చేశారంటే.. 

Also Read: Team India: ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News