New Love story: వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో మొహం చెక్కేశారు!

Love story of five elderly men in Bihar’s Nalanda: ఐదుగురు ముసలోళ్లు కలిసి ఒక టీ కొట్టు ఆంటీని ప్రేమించడంతో అందులో ఒక వృద్ధుడిని చంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే   

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 30, 2022, 09:58 AM IST
New Love story: వింత ప్రేమ.. నలుగురు ముసలోళ్లతో ‘ఆంటీ’ లవ్.. ఐదో వ్యక్తి ఎంట్రీతో మొహం చెక్కేశారు!

Love story of five elderly men ends a life with murder in Bihar’s Nalanda: బీహార్‌లోని నలంద జిల్లాలో ఓ వృద్ధుడు లేటు వయసులో ప్రేమలో పడి తన ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. 30 ఏళ్ల వితంతువును నలుగురు వృద్ధ ప్రేమికులు ప్రేమిస్తూ ఉండగా 5వ ప్రేమికుడిగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఈ వింత ఉదంతం బీహార్ లోని నలంద జిల్లాలో వెలుగు చూసింది. కస్టడీలో ఉన్న సదరు ప్రియురాలిని పోలీసులు విచారించగా, కేసు ఛేదించడమే కాకుండా పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కేసు అస్తవా పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్వాపూర్ గ్రామానికి సంబంధించినది.

అక్కడ 32 ఏళ్ల వితంతువు ఒక టీ స్టాల్ నడుపుతుంది. ఆమె ఒకరికి తెలియకుండా ఒకరితో వివాహేతర సంబంధాలు మొదలుపెట్టింది. ఇక అలా నలుగురితో సంబంధాలు మెయిన్ టైన్ చేస్తూ ఉండగా ఈ కథలోకి 70 ఏళ్ల త్రిపిత్ శర్మ కథలోకి ఎంట్రీ ఇచ్చారు. శర్మ కూడా ముందువారిలాగే తనను ప్రేమించమని ఆమెను అభ్యర్థించాడు. దీంతో ఆ మహిళ మిగతా ప్రేమికులకి కోపం వచ్చిందని చెబుతున్నారు. దీంతో అందరూ కలిసి ఐదవ వృద్ధుడిని పెద్దను నిర్జన ప్రదేశానికి పిలిచి హత్య చేసేందుకు కుట్ర పన్నారని బీహార్ షరీఫ్ (సదర్) డీఎస్పీ డాక్టర్ షిబ్లీ నోమాని తెలిపారు. ఆ మహిళ నలుగురితో కలిసి శర్మను అక్టోబర్ 19న నిర్జన ప్రదేశానికి పిలిపించి, ఆ తర్వాత శర్మను కొట్టి చంపి, మృతదేహాన్ని కొత్తగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్‌లోని వాటర్ ట్యాంక్‌లో పడేశారని పేర్కొన్నారు.

అలాగే అతడి ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా రాయితో చితకబాదారు. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శర్మ కుమారుడు మిథు కుమార్ అదే రోజు అస్తవాన్ పోలీస్ స్టేషన్‌లో తన తండ్రి హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. పోలీసులు విచారణలో మృతుడు అస్తవాన్‌ పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోని టీ స్టాల్‌లో తరచూ కూర్చునేవాడని తెలిసింది. అదే సమయంలో మృతుడి మొబైల్ ఫోన్ పోలీసులకు లభించలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నెల రోజుల తర్వాత ఫోన్ ఓపెన్ చేయగా.. అప్పటికే నిఘా ఉంచడంతో ఆ మెసేజ్ పోలీసులకు వచ్చింది. వెంటనే సదరు మహిళా నుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

పోలీసులు కఠినంగా విచారించగా, ఆ మహిళ ఓపెన్ అయింది. విచారణలో, అక్టోబర్ 19న, ప్రియురాలు ఆమె నలుగురు ప్రియుళ్లు ఐదుగురు మోసపూరితంగా 75 ఏళ్ల త్రిపిత్ శర్మను నిర్జన ప్రదేశానికి పిలిచారని, ఆ తరువాత హత్య చేశామని అంగీకరించారు.  నిజానికి అతను ప్రపోజ్ చేసినప్పుడు సదరు మహిళ ఒప్పుకుందని, దీంతో అతను ఆమె ఇంటికి వచ్చి వెళ్ళడం ప్రారంభించారు. ఈ విషయం మిగతా నలుగురు ప్రేమికులకు ఇబ్బంది కలిగించడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమె వారిపై తక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభించింది. ఒకరోజు నలుగురూ కలిసి మన ఐదుగురిలో ఈ ఆరో వాడు జోక్యం చేసుకోవడం మంచిది కాదని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని అనడంతో అందుకు మహిళ కూడా ఒప్పుకుంది. అలా అక్టోబర్ 19న, త్రిపిత్ శర్మను నిర్జన ప్రదేశంలో కలవడానికి పిలిచారు. అతను థన్ ప్రేయసి పిలిచింది కదా అంటూ ఈల వేసుకుంటూ వాళ్లు చెప్పిన ప్రదేశానికి వెళ్లారు, అక్కడ వారి నలుగురు ప్రత్యర్థులు అప్పటికే ఉన్నారు.

మొదట వారి మధ్య వాగ్వాదం జరిగింది, ఎవరూ వెనక్కు తగ్గడానికి ఇష్టపడలేదు. దీంతో నలుగురూ కలిసి అతన్ని చంపేసి వాటర్ ట్యాంక్ లో పడేశారు. సదర్ డీఎస్పీ డాక్టర్ షిబ్లి నోమాని మాట్లాడుతూ.. ఇలాంటి కేసు తన ముందు కనిపించడం ఇదే మొదటి సారని అన్నారు. పోలీసు బృందం బాగా పని చేసిందని, ఈ కేసులో మహిళ సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారని అన్నారు. అరెస్టయిన నిందితుల్లో 30 ఏళ్ల టీ విక్రేత పినో దేవి, బార్బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతుబ్‌చాక్‌లో నివాసం ఉంటున్న 75 ఏళ్ల కృష్ణానంద్ ప్రసాద్, అస్తవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్తవాన్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల సూర్యమణి కుమార్, బనారస్ ప్రసాద్ అలియాస్ ఉన్నారు. మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌పూర్ గ్రామానికి చెందిన లోహా సింగ్ కూడా ఉన్నారు. 

Also Read: ప్రభాస్ తో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన కృతి.. డేట్ ప్రకటించక ముందే అంటూ పోస్ట్!

Also Read: మందేసి బండెక్కిన యువతి, మరో అమ్మాయితో కలిసి ఇంటికి తీసుకెళ్లి డ్రైవర్ గ్యాంగ్ రేప్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News