Pension Money Case: పెన్షన్ సొమ్ము దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ చిన్న క్లూతో బట్టబయలు

Anakapalli Pension Money Case: అనకాపల్లి జిల్లాలో పెన్షన్‌ డబ్బుల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఒక చిన్న క్లూ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. చోరీ అంతా పెద్ద నాటకమని తేల్చారు. ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2023, 12:06 AM IST
Pension Money Case: పెన్షన్ సొమ్ము దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ చిన్న క్లూతో బట్టబయలు

Anakapalli Pension Money Case: అనకాపల్లి జిల్లాలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ సొమ్ము దోపిడీకి గురైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అరెస్టు చేయగా.. బండారం బట్టబయలు అయింది. నక్కపల్లి మండలం జానకీయపేట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పథకం ప్రకారం అతని ఇద్దరు స్నేహితులు కలిసి దోపిడీకి స్కెచ్ వేసినట్లు ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నిందితుడు డిజిటల్ అసిస్టెంట్ బ్యాంకు నుంచి రూ.13.5 లక్షల పెన్షన్ సొమ్మును డ్రా చేసుకొని వస్తుండగా.. మార్గమధ్యలో ఆపి అతని కంట్లో కారం కొట్టి డబ్బులు దోపిడీ చేసినట్లు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. నిందితుల వాడిన బైక్ కలర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించారు. నిందితులు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఓపిడీకి పాల్పడినట్లు ఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి.. రూ.12,92,000, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  నిందితులు ముగ్గురు ఒకే ప్రాంతాన్ని చెందినవారని తెలిపారు. 

ఫిర్యాదులో ఏం చెప్పారంటే..?

జానకయ్యపేట సచివాలయంలో  వెంకటేశ్‌, నానిబాబు వెల్ఫేర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఆగస్టు 31 గురువారం సాయంత్రం వీరిద్దరు పెన్షన్‌ డబ్బులు 13,78,500 రూపాయలను ఐవోబీ బ్రాంచ్ నుంచి డ్రా చేశారు. డబ్బులను బ్యాగ్‌లో తీసుకుని.. బైక్‌పై జానకయ్యపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో ఇద్దరు దుండగులు వీరిద్దరిని అడ్డగించి.. కళ్లలోకి కారం కొట్టారు. దాడి నుంచి తప్పించుకునేలోపు.. డబ్బుల బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే పోలీసు విచారణలో ఇదంతా కట్టుకథ అని తేలిపోయింది. ప్రభుత్వ సొమ్మును కాజేయబోయి చివరికి కటకటాల పాలయ్యారు.

Also Read: MP Komatireddy: ఎవడిదిరా బానిసత్వ పార్టీ.. మంత్రి కేటీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు  

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News