Gang Rape Case: ప్రియుడి కళ్లేదుటే బాలికపై అత్యాచారం.. సాయం పేరుతో దారుణం

Rajasthan Crime News: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి చితకబాది.. అతని కళ్లేదుటే ఓ బాలికపై ముగ్గురు విద్యార్థులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..    

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2023, 02:07 PM IST
Gang Rape Case: ప్రియుడి కళ్లేదుటే బాలికపై అత్యాచారం.. సాయం పేరుతో దారుణం

Rajasthan Crime News: ప్రేమించిన యువకుడితో పారిపోయిన ఓ దళిత బాలిక (17)పై ముగ్గురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. సాయం పేరుతో ప్రేమికులను నమ్మించి.. ఓ ప్రదేశానికి తీసుకువెళ్లి యువకుడిని చితకబాదారు. అనంతరం బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశరు. బాలిక ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. 

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అమృత దుహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక శనివారం మైనర్ బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. వీరిద్దరూ శనివారం రాత్రి బస్సులో జోధ్‌పూర్‌కు చేరుకుని బస్టాండ్ సమీపంలో బస చేసేందుకు వెతుకుతున్నారు. అయితే ఇద్దరు మైనర్లు కావడంతో వారికి హోటల్ ఇచ్చేందుకు ఎవరు ఒప్పుకోలేదు. జోధ్‌పూర్‌లో ఓ రూమ్ రెంట్‌కు తీసుకునేందుకు వెళ్లగా.. అక్కడ పనిచేస్తున్న కేర్‌టేకర్ సురేష్‌ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

అక్కడి నుంచి బయటకు రాగా.. పవోటా చౌరహా వద్ద నిందితులు సమందర్ సింగ్ (21), భట్టం సింగ్ (22), ధర్మపాల్ సింగ్ (21) వీరికి సాయం చేస్తామని చెప్పారు. ఆహారం అందించి.. బస చేసేందుకు చోటు కల్పిస్తామని చెప్పారు. రాత్రికి పడుకోని తెల్లవారుజామున 4 గంటలకు ట్రైన్‌లో పంపిస్తామని చెప్పారు. వారిని జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ (జేఎన్‌వీయూ) పాత క్యాంపస్‌లోని హాకీ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు.

పడిపోయిన గోడ నుంచి క్యాంపస్‌లోకి వెళ్లారు. లోపలికి వెళ్లగానే ఇద్దరు నిందితులు మైనర్ బాలుడిని పట్టుకుని.. అతనిపై దాడి చేశారు. గొంతును బిగించి.. బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. 

సమాచారం అందుకున్న డీసీపీ దుహన్, పోలీస్ కమిషనర్ రవిదత్ గౌర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బాలికను రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులను గాలింపు చర్యలు చేపట్టగా.. నిందితుల్లో ఒకరిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. మిగతా ఇద్దరు నిందితులను కూడా దొరికిపోయారు. అమ్మాయికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరు పోలీసు రక్షణలో ఉన్నారు. 

Also Read: ORR Road Accident: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం  

Also Read: SBI ATM Franchise: నో రిస్క్.. నో టెన్షన్.. తక్కువ పెట్టబడితో ప్రతి నెలా రూ.70 వేల వరకు సంపాదన   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News