Ranjith Sreenivasan Murder Case: బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

BJP Leader Ranjith Sreenivasan Murder Case: బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మందికి మరణ శిక్షను ఖరారు చేసింది కేరళ అలప్పుజ కోర్టు. కేరళ చరిత్రలో ఒకేసారి 15 మందికి మరణశిక్షను విధించడం సంచలన రేకిత్తిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 30, 2024, 01:23 PM IST
Ranjith Sreenivasan Murder Case: బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 15 మందికి మరణ శిక్ష

BJP Leader Ranjith Sreenivasan Murder Case: ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ అలప్పుజ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషులుగా తేలిన మొత్తం 15 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. 2021 డిసెంబర్ 19న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను పీఎఫ్‌ఐ కార్యకర్తలు అతని ఇంటిలో చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు.. నిందితులుగా తేలిన 15 మందికి మరణ శిక్షను విధించింది. 

కేరళ చరిత్రలో ఒకేసారి ఇంతమందికి నిందితులకు మరణశిక్ష ఖరారు చేయడం ఇదే తొలిసారి. నిందితులుగా నైసామ్, అజ్మల్, అనూప్, మహ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం అలియాస్ సలాం, సఫరుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాస్, సమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతుంగల్, షెర్నాస్ అష్రఫ్ ఉన్నారు. వీరు నిషేధం విధించిన ఇండియా పాపులర్ ఫ్రంట్‌తో అనుబంధంగా ఉన్నారు. మావెలిక్కర అదనపు జిల్లా న్యాయమూర్తి వీజీ శ్రీదేవి మరణ శిక్షను ఖరారు చేశారు.

నిందితుల‌కు గరిష్ట శిక్షను విధించాలని ప్రాసిక్యూషన్ వాదించగా.. ఈ కేసు మరణశిక్షను సమర్థించే అరుదైన కేటగిరీ కిందకు రాదని డిఫెన్స్ వాదించింది. నిందితుల్లో మొదటి 8 మంది నిందితులు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. వారిపై 302, 149, 449, 506, 341 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. మరణాయుధాలతో ఇంటి వెలుపల కాపలాగా ఉన్న తొమ్మిది నుంచి 12 మంది నిందితులపై 302, 149, 447 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు. కీలక కుట్రదారులైన జకీర్ (13వ నిందితుడు), షాజీ (14వ నిందితుడు), షెర్నాస్ (15వ నిందితుడు)లు వరుసగా 120బీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు మరణ శిక్షను ఖరారు చేసిన కోర్టు.. అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దోషులకు మానసిక స్థైర్య పరీక్ష కూడా నిర్వహించాలని ఆదేశించింది.

2021 డిసెంబర్ 19న రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేయగా.. అంతకు ముందురోజు రాత్రి మన్నంచేరిలోని కుప్పెజ్జం జంక్షన్‌లో ఎస్‌డీపై రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రతీకారంగానే రంజీత్‌ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. షాన్ హత్యకేసులో విచారణ ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. 2022 మార్చి 16న ఛార్జ్ షీట్ దాఖలు చేసినా.. ప్రత్యేక ప్రాసిక్యూటర్‌లను నియమించడంలో విచారణ ఆలస్యమైంది . మొదటగా నియమితులైన ఇద్దరు వివిధ కారణాలతో ఉపసంహరించుకోగా.. పీపీ హరీస్ గత వారమే ఆ పదవిలో నియమితులయ్యారు.

Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News